E-Paper
Advertisement

Benefits of makhanas: మఖానా తింటే ఎన్నో సమస్యలు మటు మాయం..

Benefits of makhanas: మఖానా తింటే ఎన్నో సమస్యలు మటు మాయం..
Advertisement

Benefits of makhanas: మఖానాతో ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది స్నాక్ ఐటమే అయినా కూడా ఇందులో పుష్కలమైన పోషకాలు దాగి ఉన్నాయి. ఇది వాస్తవానికి తామరపువ్వుల నుంచి గింజల రూపంలో వస్తుంది. దీనిని ప్రతీరోజూ స్నాక్ ఐటమ్ గా లేక పాయసం వంటి వాటి రూపంలో కూడా తీసుకున్నా కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే దీనిని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు, మరియు తింటారు కూడా. ఇక మఖానాతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

ఫూల్ మఖానా సాధారణంగా తెలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి. ఇవి తామర పువ్వు నుంచి వచ్చే గింజలు. అయితే తామర పువ్వు గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఉండే యాంటా ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయి. ముఖ్యంగా చాలా రకాల గుండె సమస్యలకు ఇది అద్భుతంగా తోడ్పడుతుంది.

Advertisement

మఖానాలో మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, ప్రొటీన్, కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే శరీరానికి ప్రయోజనాలు ఉంటాయి. కాగా, సాయంత్రం వేళ స్నాక్ ఐటమ్ గా తీసుకోవడానికి మఖానా ఓ బెస్ట్ ఫుడ్ అని చెప్పాలి. దీనిని తినడం వల్ల అధిక బరువు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

మఖానాలో ఉండే ప్రోటీన్ శరీరంలోని కొలస్ట్రాల్ ను తగ్గించి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. దీంతో బరువును అదుపులో ఉంచుకోవచ్చు. మఖానాలో ఉండే కాల్షియం వల్ల కీళ్ల నొప్పులు సమస్యను తగ్గించుకోవచ్చు. మరోవైపు తరచూ కాళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా మఖానా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా మఖానా తోడ్పడుతుంది.

Advertisement

ఇక నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడేవారు కూడా మఖానా తీసుకుంటే ఇక ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచూ మంచి నిద్ర కూడా పడుతుంది. ఇక రాత్రి మంచిగా నిద్రపోవాలనుకునే వారు గ్లాసు పాలు తీసుకుని అందులో ఒక పిరికెడు మఖానా తీసుకుని అందులో కలుపుకుని తీసుకుంటే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇక చాలా రకాల చర్మ సమస్యలకు కూడా మఖానా తోడ్పడుతుంది. ముఖంపై మచ్చలు, మడతలను తొలగించి చర్మాన్ని రక్షిస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

Big Stories

Advertisement
×