E-Paper
Advertisement

Soundarya: బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన సౌందర్య.. అలాంటి పాత్ర అయితే చేయనని..

Soundarya: బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన సౌందర్య.. అలాంటి పాత్ర అయితే చేయనని..
Advertisement

Soundarya: అలనాటి తార సౌందర్య గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలబోసిన హీరోయిన్స్ లో   సౌందర్య పేరు మొదటి వరుసలో ఉంటుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె.. మన మధ్య లేకపోకపోయినా   ఆమె నటించిన సినిమాల ద్వారా ఎల్లప్పుడూ  జీవిస్తూనే ఉంది.

ఇక  సౌందర్య బ్రతికి ఉన్నంతవరకు కూడా హీరోయిన్ గానే నటించింది. కొన్ని కారణాల వలన కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసిందని సమాచారం. అలా రిజెక్ట్ చేసిన సినిమాల్లో  బాలకృష్ణ  నటించిన చెన్నకేశవరెడ్డి ఒకటి. ఈ వినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించాడు.

Advertisement

రాయలసీమ ఫ్యాక్షన్  నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య.. తండ్రీకొడుకులుగా నటించారు. ఇందులో పెద్ద బాలకృష్ణ సరసన టబు నటించగా, చిన్న బాలకృష్ణ సరసన శ్రీయ  నటించింది. మొదట టబు పాత్ర సౌందర్య వద్దకు వచ్చిందంట. ఈ విషయాన్నీ వివి వినాయక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

” చెన్నకేశవరెడ్డి సినిమాకు బాలయ్యకు జోడిగా ముందు సౌందర్యను అనుకున్నాను. బెంగుళూరు వెళ్లి సౌందర్యకు కథ కూడా  వినిపించాను.  కథలో అటు యంగ్ , ఇటు ఓల్డ్ రెండు ఉంటాయని చెప్పగానే..ఆమె ఓల్డ్ క్యారెక్టర్ ఇప్పుడప్పుడే వద్దు వినాయక్ గారు.. కొన్నిరోజులు ఆగుదాం. మళ్లీ ఓల్డ్ క్యారెక్టర్స్ లోకి వెళ్ళిపోతాము అని చెప్పింది. అప్పటికే నేను, సౌందర్యతో నాలుగు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా  చేశాను.

Advertisement

ఇక ఆమె అలా అనడంతో ఆ పాత్రకు ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు టబు గుర్తొచ్చింది. వెంటనే ఆమెను అడిగితే ఓకే చెప్పింది. అలా సౌందర్య  రిజెక్ట్ చేయడంతో టబుకు ఛాన్స్ దక్కింది” అని వినాయక్ తెలిపారు. 2002 లో చెన్నకేశవరెడ్డి రిలీజ్ అయ్యింది. సినిమాలో నా కొప్పులో నీ మల్లె తోట సాంగ్  ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమ రిలీజ్ అయిన రెండేళ్లకు సౌందర్య విమాన ప్రమాదంలో మరణించింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×