Soap tips :డైలీ మనం మన శరీరాన్ని క్లీన్ గా ఉంచుకునేందుకు మార్కెట్లో దొరికే రకరకాల సబ్బులని వాడుతుంటాం. అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే అందరు మనవాళ్ళేగా అంటూ ఒకే సబ్బుని అందరూ వాడుతుంటారు. వినడానికి ఇది చాలా సాధారణ విషయంగా అనిపించొచ్చు. కానీ దీని వెనుక కొన్ని షాకింగ్ నిజాలు దాగి ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా.అవును.. అసలు ఒకే సబ్బును ఫ్యామిలీ మొత్తం వాడటం వల్ల చర్మ సమస్యలు అన్ని సార్లు రాకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా డేంజర్.
ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి చర్మ సమస్యలు
సబ్బులో ఉండే కెమికల్స్ సాధారణంగా బ్యాక్టీరియాను తొలగిస్తాయి. కానీ సబ్బు తడిగా ఉన్నప్పుడు దానిపై సూక్ష్మక్రిములు కొంతసేపు జీవించి ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ గనుక మీ ఇంట్లో ఎవరికైనా గజ్జి, తామర లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి చర్మ సమస్యలు ఉన్నాయనుకోండి. వాళ్ళు వాడిన సబ్బునే మిగతా వాళ్ళు వాడితే వారికున్న రోగాలు ఇతరులకి వచ్చే అవకాశం ఎక్కువ.
also read :థలపతి విజయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
ఒక్కొకరి స్కిన్ టోన్ ఒక్కో రకం
ఇక కేవలం వ్యాధులు మాత్రమే కాదండోయ్.. ఒక్కొకరి స్కిన్ టోన్ ఒక్కో రకంగా ఉంటుంది. కొందరిది జిడ్డు చర్మం అయితే, మరికొందరిది పొడి చర్మం. జిడ్డు చర్మం ఉన్నవారికి ఆయిల్ ను కంట్రోల్ చేసే సబ్బులు అవసరం, అదే పొడి చర్మం ఉన్నవారు మాత్రం మాయిశ్చరైజింగ్ సబ్బులు వాడాలి. అలా కాకుండా ఒకరి సబ్బే అందరు వాడితే కొందరి చర్మం విపరీతంగా పొడిబారిపోయే ప్రమాదం అధికంగా ఉంటుంది.
పిల్లల విషయంలో కేర్ ఫుల్
ఇక అన్నికన్నా ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలండోయ్. అసలే పిల్లల చర్మం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. పెద్దలు వాడే సబ్బుల్లో గాఢత (Ph) అధికంగా ఉండే ఛాన్స్ ఎక్కువ. అందులో ఉండే కెమికల్స్ పిల్లల చర్మంపై రాషెస్ లేదా అలర్జీలను కలిగించే అవకాశం అధికంగా ఉంటుంది. సో పిల్లలకి సబ్బు కంటే కూడా లిక్విడ్ బాడీ వాష్ లేదా షవర్ జెల్ వాడటం చాలా ఉత్తమం అన్నది నిపుణుల మాట. ఎందుకంటే బాడీ వాష్ బాటిల్ లో ఉంటుంది కాబట్టి దానిని నేరుగా ఒకరి చర్మంపై మరొకరు రుద్దే ఛాన్స్ ఉండదు. తద్వారా క్రిములు వ్యాపించే ఛాన్స్ కూడా తక్కువ.
వాడిన తర్వాత దానిని తడిగా ఉంచకుండా
ఒకవేళ మీరు సబ్బునే వాడాలని అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరూ వేరు వేరు సబ్బులని వాడటం మంచిది. ఇక సబ్బు వాడిన తర్వాత దానిని తడిగా ఉంచకుండా పొడిగా ఉండేలా చూడాలి. ఏదైనా చర్మ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా వేరే సబ్బును వాడాలి. అలా కాకుండా ఇంట్లో వాళ్ళు వాడిన సబ్బునే వాడితే మీ వ్యాధులని వాళ్ళకి అంటించినట్టే. అర్థమయింది గా. సో ఇప్పటి నుండైనా ఎవరికి వారు వేరు వేరు సబ్బులని వాడండి. మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంచుకోండి!
also read :‘ముసలి ప్రొడ్యూసర్.. యంగ్ హీరోయిన్.. మంచం కింద నేను’..ఆ రాత్రి జరిగిన సీక్రెట్ బయటపెట్టిన జేడీ.