E-Paper
Advertisement

గంజాయి మత్తులో యువకులు హల్చల్.. కిరాణా షాపు ధ్వంసం

గంజాయి మత్తులో యువకులు హల్చల్.. కిరాణా షాపు ధ్వంసం
Advertisement

Crime News: స్వేచ్ఛ బ్యూరో: సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో గంజాయి వాడకం రోజురోజుకు పెరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గ్రామంలో గంజాయి మత్తులో తిరుగుతున్న యువకుల దాడులు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి టేకుమట్ల ఖమ్మం రహదారి పక్కన ఉన్న ఓ కిరాణా దుకాణంలో ఇద్దరు యువకులు గంజాయి మత్తులోకి వెళ్లి దుకాణ యజమానులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: Chris Gayle: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

భయంతో గ్రామస్థులు..

Advertisement

దాడి చేసిన వారు అంతటితో ఆగకుండా సూర్యాపేట నుంచి తమ స్నేహితులను పిలిపించి గ్రామంలో గందరగోళం సృష్టించారు.దుకాణంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి భయానక వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. గ్రామాల్లో గంజాయి బ్యాచ్ హల్చల్ పెరుగుతుండటంతో అమాయక ప్రజలు భయంతో జీవిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గంజాయి విక్రయాలు, వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Kriti Sanon: హాట్ డోస్ తో చెమటలు పట్టిస్తున్న కృతి సనన్.. ఫోటోలు వైరల్!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×