Vijay Drone:తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అనే పార్టీ పెట్టి తమిళ నాట ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక ప్రస్తుతం ప్రచారాన్ని హోరెత్తిస్తున్న విజయ్ తమిళ నాడు అంతటా పర్యటిస్తున్నారు. ఈక్రమంలో ఈరోజు రాజకీయ ప్రచారంలో అనుకోని షాకింగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్ చూస్తుంటే విజయ్ అభిమానులు హమ్మయ్య ప్రాణాపాయం తప్పిందిగా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. డ్రోన్ కెమెరా ఆపరేటర్ చేసిన అతి పెద్ద పొరపాటు కారణంగా విజయ్ ముఖానికి అతి సమీపంలోకి డ్రోన్ దూసుకురావడం, చివరి నిమిషంలో ఆయన తప్పించుకోవడం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగింది?
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన్ని చూడటానికి వేలాదిగా తరలివచ్చారు. ఇక ఆ జనాన్ని, కోలాహాలాన్ని, విజయ్ రియాక్షన్స్ ని క్యాప్చర్ చేసేందుకు డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. అయితే, ఒక సన్నగా ఉండే వీధిలో విజయ్ తన ప్రచారాన్ని కొనసాగిస్తూ అందరికి అభివాదం చేస్తూ వెళ్తున్న సమయంలో, ఒక డ్రోన్ కెమెరా అనుకోకుండా కంట్రోల్ తప్పి డైరెక్ట్ గా విజయ్ వైపు దూసుకొచ్చింది. సరిగ్గా అలాగే ఇంకొన్ని సెంటి మీటర్లు అలాగే వెళితే విజయ్ ముఖం లేదా మెడ భాగాన్ని కట్ చేసేదే.
also read:‘ముసలి ప్రొడ్యూసర్.. యంగ్ హీరోయిన్.. మంచం కింద నేను’..ఆ రాత్రి జరిగిన సీక్రెట్ బయటపెట్టిన జేడీ.
రెప్పపాటులో పెను ముప్పు!
డ్రోన్ రెక్కలు (Propellers) మాములుగా ఉండవు. చాలా షార్ప్ గా, హై స్పీడ్ తో తిరుగుతుంటాయి. అవి గనుక బాడీకి టచ్ అయితే తెగి రక్తం రావడమే కాదు, ప్రాణాలు కూడా పోవచ్చు. ఒక్కసారిగా డ్రోన్ తన ముఖం వైపు రావడం, అదే సమయంలో విజయ్ గుర్తించి వెంటనే వెనక్కి వంగి దాన్నుండి తప్పించుకున్నారు. ఇక అదే సమయంలో పక్కనే ఉన్న సెక్యూరిటీ ఏమాత్రం లేట్ చేయకుండా, ఆ డ్రోన్ ని చేత్తో బలంగా కొట్టి పక్కకి తోసేయడంతో అది కాస్తా కిందపడిపోయింది.
వైరల్ అవుతున్న షాకింగ్ విజువల్స్!
ఇక తాజాగా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయిపొయింది. ఇక ఇది చూసిన దళపతి ఫ్యాన్స్ అసలు డ్రోన్ ఆపరేటర్ అంత కేర్ లెస్ గా ఎలా ఉంటాడు అంటూ ఫైర్ అవుతున్నారు. మరో వైపు ఒక స్టార్ హీరో, ఒక పార్టీ చీఫ్ భద్రత విషయంలో ఇలాంటి అజాగ్రత్త ఉండటం ఎంటన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్.
ఇక గతంలో కూడా విజయ్ రోడ్ షోలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఏది ఏమైనా ఇలా అవాంతరాలు అన్ని విజయ్ కే ఎదురవడం కాస్త ఆశ్చర్యమే, చూడాలి మరి విజయ్ భద్రతా సిబ్బంది ముందు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో!
also read:మీమ్స్ రాజాలకి మైండ్ బ్లాక్.. బన్నీ పేరు వాడితే 72 గంటల్లో ఖతం!
DRONE OPERATER எவன் டா ! 😡 pic.twitter.com/GDLT2gznkd
— Prakash Vijay (@PrakazVijay_Of) April 21, 2026