E-Paper
Advertisement

తక్కువ హైట్ ఉన్న అమ్మాయిలు ఇలాంటి దుస్తులు ధరించకూడదు.. స్టైలిష్‌గా కనిపించాలంటే చేయకూడని తప్పులు ఇవే

తక్కువ హైట్ ఉన్న అమ్మాయిలు ఇలాంటి దుస్తులు ధరించకూడదు.. స్టైలిష్‌గా కనిపించాలంటే చేయకూడని తప్పులు ఇవే
Advertisement

ప్రతి అమ్మాయి అందంగా, స్టైలిష్‌గా, ఆత్మవిశ్వాసంతో కనిపించాలని కోరుకుంటుంది. మంచి దుస్తులు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఫ్యాషన్‌ అనుకొని చిన్న పొరపాటు చేసినా మొత్తం లుక్‌ చెడిపోతుంది. ముఖ్యంగా పొట్టిగా ఉన్న అమ్మాయిల విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సరైన దుస్తులు ఎంచుకుంటే ఎత్తుగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అందుకే కొన్ని ఫ్యాషన్‌గా కనిపించే క్రమంలో ఈ తప్పులు చేయకుండా ఉండడం చాలా ముఖ్యం.

చాలా వదులుగా ఉండే దుస్తులను ధరించకూడదు

ప్రస్తుతం ఓవర్‌సైజ్ దుస్తులు ఫ్యాషన్‌లో ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు అవి సౌకర్యంగా ఉంటాయని భావించి వాటిని ఎంచుకుంటారు. అయితే చాలా వదులుగా ఉండే దుస్తులు శరీర ఆకృతిని పూర్తిగా కప్పివేస్తాయి.
ఇలాంటి దుస్తులు శరీరాన్ని వెడల్పుగా చూపించడంతో పాటు ఎత్తు తక్కువగా కనిపించేలా చేస్తాయి. అందుకే శరీరానికి సరిపోయే ఫిట్‌ సైజుతో ఉన్న దుస్తులను ఎంచుకోవడం మంచిది. సరైన ఫిట్టింగ్ ఉన్న దుస్తులు మీ ఆకృతిని అందంగా చూపించి ఎత్తుగా కనిపించేలా సహాయపడతాయి.

పెద్ద ప్రింట్లు ఉన్న దుస్తులకు దూరంగా ఉండాలి

Advertisement

పెద్ద పూల డిజైన్లు లేదా వెడల్పాటి ప్రింట్లు చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ అవి పొట్టిగా ఉన్న అమ్మాయిలకు అంతగా బాగుండవు. పెద్ద ప్రింట్లు శరీరాన్ని మరింత వెడల్పుగా చూపిస్తాయి. దీంతో ఎత్తు తగ్గినట్లు అనిపించవచ్చు. చిన్న చిన్న ప్రింట్లు లేదా సింపుల్ డిజైన్లు ఉన్న దుస్తులు ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా నిలువుగా ఉండే గీతల డిజైన్లు ఎత్తుగా కనిపించే భావనను కలిగిస్తాయి.

చాలా పొడవైన కుర్తీలు లేదా టాప్స్ ధరించకూడదు

చాలా పొడవైన కుర్తీలు లేదా టాప్స్ శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయి. మోకాళ్ల కంటే చాలా దిగువకు వచ్చే కుర్తీలు కాళ్ల పొడవును తక్కువగా చూపిస్తాయి. దీంతో మొత్తం ఎత్తు తగ్గినట్లు కనిపిస్తుంది. అందుకే మోకాళ్ల వరకు లేదా కొంచెం పైభాగంలో ముగిసే కుర్తీలను ఎంచుకోవడం మంచిది. సరైన పొడవు ఉన్న దుస్తులు మీ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి.

పాదరక్షలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి

Advertisement

ఫ్యాషన్‌లో దుస్తులతో పాటు సరైన షుస్ ధరించడం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బరువుగా ఉండే షూస్ లేదా పూర్తిగా ఫ్లాట్ చెప్పులు ఎప్పుడూ ధరించకూడదు. దీని వల్ల ఎత్తు మరింత తక్కువగా కనిపిస్తుంది. చిన్న హీల్స్ ఉన్న చెప్పులు, పాయింటెడ్ షూస్ లేదా న్యూడ్ కలర్ ఫుట్‌వేర్ ఎంచుకోవడం మంచిది. ఇవి కాళ్లు పొడవుగా కనిపించేలా చేసి స్టైలిష్ లుక్‌ను అందిస్తాయి.

Also Read: పది మందిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.. మీ మాటలకు అందురూ ప్రాధాన్యం ఇవ్వాలంటే ఇలా చేయండి

ఎక్కువ లేయరింగ్ చేయకుండా ఉండాలి

చలికాలంలో లేయరింగ్ బట్టలు ధరించడం ఫ్యాషన్‌గా కనిపిస్తుంది. అయితే చాలా లేయర్లు ధరించడం వల్ల శరీరం భారీగా కనిపిస్తుంది. ఇది ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలకు అంతగా సరిపోదు. ఒకటి లేదా రెండు లేయర్లు మాత్రమే ఉపయోగించడం మంచిది. సింపుల్, క్లీన్‌గా ఉండే స్టైల్ ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఎత్తు తక్కువగా ఉండటం ఫ్యాషన్‌కు ఎప్పుడూ అడ్డంకి కాదు. సరైన దుస్తులు, పాదరక్షలు, స్టైలింగ్ ఎంపికలతో మరింత అందంగా కనిపించవచ్చు. వదులైన దుస్తులు, పెద్ద ప్రింట్లు, పొడవైన టాప్స్, సరిపోని ఫుట్‌వేర్, అధిక లేయరింగ్‌ను నివారించడం ద్వారా ఎత్తుగా, స్లిమ్‌గా స్టైలిష్‌గా కనిపించవచ్చు.

Related News

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

మీ ఇల్లంతా సువాసన, ఫ్రెష్ గాలితో నిండిపోతుంది.. కేవలం ఈ మొక్కలు పెంచితే చాలు

Big Stories

Advertisement
×