Shane Watson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. ఇవాళ ఫైనల్స్ జరగనుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) తలపడనున్నాయి. అయితే ఇలాంటి క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ (Shane Watson). మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ అని అంటారు.. కానీ అదంతా ఫేక్ అంటూ బాంబు పేల్చారు. మహేంద్ర సింగ్ ధోనికి ( MS Dhoni ) ఒళ్లంతా పొగరే ఉంటుందని.. ఒకానొక సమయంలో గ్రౌండ్ లోకి వచ్చి అంపైర్లను బెదిరించినట్లు షాకింగ్ నిజాలను పంచుకున్నారు షేన్ వాట్సన్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఒకప్పటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు షేన్ వాట్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందరూ అనుకున్నట్లుగా మహేంద్ర సింగ్ ధోని కూల్ గా ఉండబోడని.. అవసరం వచ్చినప్పుడు అగ్నిపర్వతంలో బద్దలవుతాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. రూల్స్ అందరికీ పెడతారు… కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఫాలో కాబోరని పరువు తీశారు. తాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరినప్పుడు ప్లేయర్ లందరికీ కీలక విషయాలను మహేంద్రసింగ్ ధోని చెప్పినట్లు షేన్ వాట్సన్ వివరించారు.
ఈ సారి కూడా ఫేర్ ప్లే అవార్డు ( Fair Play Award) దక్కించుకోవాలని ధోని అందరికీ సూచనలు చేశారట. కానీ ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ వచ్చాడు కాబట్టి… ఈసారి రావడం కష్టమేనా అని ఫన్నీగా ధోని ప్లేయర్ లందరితో చర్చించారట. ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలా అగ్రెసివ్ గా ఉంటారని… వాళ్లు చిన్న మాట అన్న కూడా పడబోరని ధోని స్పష్టం చేశారట. అయితే ఈ చర్చ జరిగిన మరునాడే… మహేంద్ర సింగ్ ధోని చాలా ఆగ్రహంతో మైదానంలోకి వచ్చి అంపైర్లతో గొడవ పెట్టుకున్నట్లు వాట్సన్ షాకింగ్ నిజాలను పంచుకున్నారు.
2019 ఐపీఎల్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అంపైర్ నో-బాల్ నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ… డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి ధోని వచ్చాడు. ఈ సంఘటన అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దానివల్ల ఫెయిర్ ప్లే పాయింట్లను కూడా చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) కోల్పోయిందని వాట్సన్ స్పష్టం చేశారు. అందుకే అందరూ ఊహించినట్లుగా మహేంద్ర సింగ్ ధోని కూల్ గా ఉండకూడని.. ఆయన కూడా సీరియస్ అవుతాడని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో షేన్ వాట్సన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Shane Watson on MS Dhoni game plan before IPL
" When I joined CSK in our first meeting he said all of us that we have to win both IPL & Fair play award . He added I know it will be tough as we have an aussie among us our watto" but later he himself invaded the ground against RR pic.twitter.com/uLjV1i4PhC
— Saul_Goodman (@kumar_rish30260) May 31, 2026