E-Paper
Advertisement

ప్రసవం తరువాత డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు.. ఈ ప్రమాదకర లక్షణాలుంటే జాగ్రత్త

ప్రసవం తరువాత డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు.. ఈ ప్రమాదకర లక్షణాలుంటే జాగ్రత్త
Advertisement

పిల్లలు పుట్టగానే ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే తల్లి కాగానే కొందరు మహిళలు మానసికంగా బాధపడుతుంటారు. ప్రసవం తర్వాత ఆ మహిళలు నిరంతరం బాధ, ఆందోళన, అలసట, తరుచూ ఏడుస్తూ ఉంటారు. చాలామంది వీటిని సాధారణ అలసట లేదా మూడ్ స్వింగ్స్ అని అనుకుంటారు. కానీ ఈ లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే ఇది పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అయ్యే అవకాశం ఉంది.

పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అంటే ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అనేది ప్రసవం తర్వాత వచ్చే మానసిక ఆరోగ్య సమస్య. ఇది మొదటిసారి తల్లి అయినా, ఇప్పటికే పిల్లలు ఉన్న మహిళ అయినా ఎవరికైనా రావచ్చు. ప్రసవం తర్వాత శరీరంలోని హార్మోన్లు వేగంగా మారుతాయి. అలాగే నిద్రలేమి, శారీరక బలహీనత, మానసిక ఒత్తిడి, కొత్త బాధ్యతలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి.

పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ ప్రధాన లక్షణాలు

  • ఎప్పుడూ బాధగా లేదా ఖాళీగా అనిపించడం.
  • కారణం లేకుండా తరచూ ఏడవడం.
  • ఇష్టమైన పనులపై ఆసక్తి తగ్గిపోవడం.
  • అధిక ఆందోళన లేదా భయం కలగడం.
  • నిద్ర పట్టకపోవడం లేదా ఎక్కువగా నిద్రపోవడం.
  • ఆకలి తగ్గిపోవడం లేదా ఎక్కువగా తినడం.
  • తనను తాను ఎందుకూ పనికిరానివారిగా భావించడం.
  • బిడ్డతో అనుబంధం ఏర్పడకపోవడం.
  • ఏకాగ్రత లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది కలగడం.
  • బిడ్డకు హాని చేయాలనే ఆలోచనలు రావడం.
  • ఆత్మహత్య ఆలోచనలు రావడం
Advertisement

ఈ లక్షణాలు రెండు వారాలకు పైగా కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఈ సమస్య ఎంత ప్రమాదకరం?

చికిత్స ఆలస్యం అయితే ఈ సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఇది తల్లి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే బిడ్డ సంరక్షణలో ఇబ్బందులు ఏర్పడి, శిశువు ఎదుగుదలపై కూడా ప్రభావం చూపవచ్చు.
తీవ్రమైన పరిస్థితుల్లో ఆత్మహత్య లేదా బిడ్డకు హాని చేయాలనే ఆలోచనలు కూడా రావచ్చు. అందుకే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.

ఎవరికి ప్రమాదం ఎక్కువ?

Advertisement

ఇప్పటికే డిప్రెషన్ లేదా ఆందోళన సమస్యలు ఉన్న మహిళల్లో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో అధిక ఒత్తిడి ఉండటం కూడా కారణమవుతుంది. కుటుంబ సహకారం లేకపోవడం, ఆర్థిక లేదా కుటుంబ సమస్యలు ఉండటం, సరిపడా నిద్ర లేకపోవడం కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.

Also Read: పాము కాటేసిన తరువాత ఎంతసేపు నిద్రపోకూడదు.. నిద్రపోతే ఏమవుతుంది?

ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవాలి?

ప్రతిరోజూ తగినంత విశ్రాంతి తీసుకోవాలి. పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సలహాతో తేలికపాటి వ్యాయామం చేయాలి.
తన భావాలను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోవాలి. అవసరమైతే సహాయం కోరడంలో వెనుకాడకూడదు. లక్షణాలు కనిపిస్తే సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్టును సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు.

కుటుంబ సభ్యుల సహకారం ఎందుకు అవసరం?

ప్రసవం తరువాత వెంటనే ఇలాంటి సమయంలో ఆ తల్లికి ప్రేమ, ఆదరణ, మానసిక మద్దతు చాలా అవసరం. ఆమె ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే విమర్శించకుండా, ఓపికగా వినాలి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సరైన వైద్యం, సమయానికి చికిత్సతో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ నుంచి త్వరగా కోలుకుని అమ్మ అనే అనుభూతిని ఆనందంగా ఆస్వాదించవచ్చు.

Related News

క్యూ-మార్ట్‌లో క్యూ కడుతున్న జనం.. వైరల్ అవుతున్న‘కొరియన్ ఐస్ కప్’ ట్రెండ్!

మీ పిల్లాడు ప్రతిరోజు ప్లేట్‌లో భోజనం మిగిల్చేస్తున్నాడా? ఆహారం వ్యర్థం చేయకూడదని ఇలా నేర్పించండి

ఈ పేరు గల వారు నిజమైన ప్రేమ పొందడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు.. నామ జ్యోతిష్యం

ప్రతి రోజు 30 నిమిషాలు వాకింగ్ చేయండి.. గుండె ఆరోగ్యం, బరువు కంట్రోల్‌తో పాటు ఈ ఆరోగ్య లాభాలు

ఇంట్లో అక్వేరియం పెట్టడం శుభమేనా? వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలి

మిగిలిపోయిన అన్నంతో నిమిషాల్లో క్రిస్పీ కట్లెట్స్ చేయండి.. మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచికరమైన రెసిపీ

మీ కుటుంబంలో అందరికీ షుగర్ ఉందా? మీ పిల్లలకు మధుమేహం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి

Big Stories

Advertisement
×