E-Paper
Advertisement

ఇంట్లో అక్వేరియం పెట్టడం శుభమేనా? వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలి

ఇంట్లో అక్వేరియం పెట్టడం శుభమేనా? వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలి
Advertisement

ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో డెకరేషన్ కోసం రంగురంగుల చేపలతో కూడిన అక్వేరియంను హబ్‌గా పెట్టుకుంటున్నారు. అక్వేరియం ఇంటికి ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వడమే కాకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా కల్పిస్తుంది. వాస్తు శాస్త్రం, ఫెంగ్ షూయ్ సంప్రదాయాల ప్రకారం ఇంట్లో నీళ్లు, జలానికి సంబంధించిన వస్తువులు సానుకూల శక్తిని పెంచుతాయని నమ్మకం.
అయితే అక్వేరియం ఇంట్లో తీసుకురావడమే సరికాదు. దాన్ని సరైన దిశలో ఉంచడం కూడా ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

అక్వేరియం ఉంచడం శుభమా?

వాస్తు శాస్త్రం ప్రకారం నీరు శాంతి, అభివృద్ధి, సానుకూల శక్తికి ప్రతీకం. ఇంట్లో అలంకరణగా పెట్టుకునే అక్వేరియం కుటుంబ సభ్యులకు ప్రశాంత కలిగిస్తుంది. అందులో ఈదే చేపలను చూడటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి మనసుకు హాయిగా అనిపిస్తుంది. అలాగే సరైన దిశలో అక్వేరియం ఉంచితే ఆర్థికాభివృద్ధి, కుటుంబ సుఖశాంతి పెరుగుతాయని వాస్తు నమ్మకాలు చెబుతున్నాయి.

అక్వేరియం ఉంచడానికి సరైన దిశ ఏది?

Advertisement

వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులు ఉంచే దిశలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అక్వేరియంను ఉత్తర దిశలో ఉంచడం చాలా మంచిదిగా భావిస్తారు. ఈ దిశ సంపద, శ్రేయస్సుకు సూచికగా చెబుతారు.
తూర్పు దిశ కూడా అక్వేరియం కోసం అనుకూలమైన ప్రదేశంగా భావిస్తారు. ఇది కొత్త ప్రారంభాలు, సానుకూల శక్తికి సంకేతంగా ఉంటుంది. ఈశాన్య దిశలో నీళ్లకు సంబంధించిన వస్తువులు ఉంచడం కూడా శుభప్రదం. దీనివల్ల ఇంట్లో ప్రశాంతత, సంతోషాలు వస్తాయని చాలామంది నమ్ముతారు.

అక్వేరియం ఉంచడానికి సరైన గది

లివింగ్ రూమ్ లేదా హాల్‌లో అక్వేరియం ఉంచడం బెస్ట్. కుటుంబ సభ్యులు, అతిథులు సులభంగా చూడగలిగే ప్రదేశంలో ఉంచితే అది ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది. అలాగే అక్వేరియంను ఎప్పటికప్పుడు చూసుకునేందుకు కూడా ఇది అనువైన స్థలం.

ఈ ప్రదేశాల్లో అక్వేరియం పెట్టకండి

Advertisement

వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో అక్వేరియం ఉంచకపోవడం మంచిది. కొందరి నమ్మకం ప్రకారం ఇది ప్రశాంతమైన నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. వంటగదిలో కూడా అక్వేరియం ఉంచరాదు. వంటగది అగ్ని తత్వానికి ప్రతీక కాగా, అక్వేరియం నీటి తత్వాన్ని సూచిస్తుంది. ఈ రెండు కలిసి ఉండటం సమతుల్యతను దెబ్బతీస్తుందని వాస్తు చెబుతుంది. ప్రధాన ద్వారానికి ఎదురుగా కూడా అక్వేరియం ఉంచకూడదు.

Also Read: ట్రూ లవర్.. ఈ తేదీలో పుట్టినవారు జీవితాంతం తోడుగా ఉంటారు

అక్వేరియం శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం

అక్వేరియం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. సమయానికి నీటిని మార్చాలి. ఫిల్టర్‌ను శుభ్రం చేయాలి. చేపలకు సరిపడా ఆహారం ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉన్న చేపలు అక్వేరియం అందాన్ని మరింత పెంచుతాయి. పరిశుభ్రంగా ఉన్న అక్వేరియం ఇంటికి మంచి ఆకర్షణగా నిలుస్తుంది.

వాస్తు ప్రకారం అక్వేరియం సరైన దిశలో ఉంచితే శుభఫలితాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. అయితే ఇవి సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఉన్న సూచనలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Related News

గంధపు చెట్ల మీదే పాములు ఎందుకు ఎక్కువగా నివసిస్తాయి? సువాసన కాదు.. అసలు కారణం ఇది

వర్షాకాలంలో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తీవ్రం.. ఇంట్లోనే ఈ డ్రింక్స్‌తో ఉపశమనం

చిన్నప్పుడు ఈ 5 అలవాట్లు ఉన్న పిల్లల్లు తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారిని పట్టించుకోరు

బరువు తగ్గాలంటే ఆకలితో ఉండాల్సిన పనిలేదు.. ఈ 4 పనులు చేయండి చాలు!

అన్న వద్ద డబ్బు గుంజడమే పని.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సోదరుల చేత ఖర్చు చేయించడంలో దిట్ట

ప్రతి రోజు మేకప్ తొలగించడానికి ఇబ్బందిపడుతున్నారా? నిమిషాల్లో మీ పని పూర్తి చేసే నేచురల్ క్లీన్సింగ్ బామ్ ఇలా చేసుకోండి

పిల్లలు తరచూ అనారోగ్యానికి ఎందుకు గురవుతారు.. డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

స్వైన్ ఫ్లూ వస్తే పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×