Festival Makeup Look Ideas| ఇప్పుడంతా పండుగల సీజన్. వినాయక చవితి, హరతాళిక వ్రత పూజ, త్వరలో దసరా. ముఖ్యంగా యువతులు, పెళ్లి అయిన మహిళలకు పండుగ రోజు చీర, లెహంగా, డ్రెస్సింగ్, నగలు ఎంత ముఖ్యమో మేకప్ కూడా అంతే ముఖ్యం. సరైన మేకప్ మీ సంప్రదాయ లుక్‌ను మరింత అందంగా మారుస్తుంది. ఈసారి పండుగకు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే ఈ 5 అందమైన మేకప్ లుక్స్ ప్రయత్నించండి.
ఎరుపు లిప్‌స్టిక్ పండుగలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఎంపికగా ఉంటుంది. ఎరుపు, మరూన్ లేదా డార్క్ పింక్ చీరలతో ఈ లుక్ చాలా బాగుంటుంది. కళ్లకు లైట్ గోల్డెన్ లేదా బ్రౌన్ ఐషాడో వేసుకోవచ్చు. సన్నని వింగ్డ్ ఐలైనర్‌తో లుక్‌ను పూర్తి చేయండి.
ఎక్కువ మేకప్ ఇష్టంలేని వారికి ఈ లుక్ మంచి ఆప్షన్. చర్మానికి సరిపోయే లైట్ బేస్ అప్లై చేయండి. అవసరమైన చోట మాత్రమే కన్సీలర్ ఉపయోగించండి. పీచ్ లేదా సాఫ్ట్ పింక్ బ్లష్‌తో ముఖానికి ఫ్రెష్ బ్యూటీ ఇవ్వండి. కొద్దిగా హైలైటర్ ఉపయోగిస్తే సహజమైన గ్లో వస్తుంది. న్యూడ్ లేదా సాఫ్ట్ పింక్ లిప్‌స్టిక్ బాగా సరిపోతుంది.
గోల్డెన్ ఐ మేకప్ సంప్రదాయ దుస్తులతో చాలా అందంగా కనిపిస్తుంది. కనురెప్పలపై గోల్డెన్ ఐషాడో అప్లై చేయండి. దానికి బ్రౌన్ షేడ్‌ను బ్లెండ్ చేసి మంచి డెప్త్ ఇవ్వండి. ఐలైనర్, మస్కారాతో కళ్లను మరింత ఆకర్షణీయంగా మార్చండి. గోల్డెన్ వర్క్ ఉన్న చీరలు, లెహంగాలతో ఈ లుక్ అద్భుతంగా ఉంటుంది.
కళ్లను హైలైట్ చేయాలనుకునే వారికి ఈ లుక్ సరైనది. కొద్దిగా మందంగా బ్లాక్ ఐలైనర్ అప్లై చేయండి. చిన్న వింగ్ కూడా ఇస్తే మరింత బాగుంటుంది. మస్కారాతో కళ్లను మరింత అందంగా చూపించండి. పింక్ లేదా రోజ్ కలర్ లిప్‌స్టిక్‌తో ఈ లుక్ బ్యాలెన్స్ చేయండి.
కొంచెం హెవీ, గ్లామరస్ లుక్ కావాలంటే బ్రైడల్ స్టైల్ ప్రయత్నించండి. బ్రౌన్, గోల్డెన్ ఐషాడోలతో అందమైన ఐ మేకప్ చేయండి. లైట్ స్మోకీ ఎఫెక్ట్ కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది. మరూన్ లేదా డీప్ రెడ్ లిప్‌స్టిక్ ఈ లుక్ బాగా సరిపోతుంది. పెద్ద బొట్టు, పాపిడి బిళ్ల, సంప్రదాయ నగలు మరింత అందాన్ని పెంచుతాయి.
Also Read: బ్రేకప్ తర్వాత మళ్లీ డేటింగ్ ఎప్పుడు ప్రారంభించాలి? మళ్లీ ప్రేమలో పడే ముందు ఈ విషయాలు ఆలోచించండి
పండుగ మేకప్ అందంగా ఉండటంతో పాటు కంఫర్ట్‌గా కూడా ఉండాలి. మీ దుస్తులు, నగలకు సరిపోయే కలర్స్ ఎంచుకోండి. మేకప్ ముందు చర్మాన్ని శుభ్రం చేసి మాయిశ్చరైజర్ ఉపయోగించండి.
Also Read: ఈ విధానంలో భోజనం చేస్తే షుగర్ ఎప్పుడూ పెరగదు.. మధుమేహులకు డాక్టర్ చెప్పిన సింపుల్ చిట్కా