E-Paper
Advertisement

గర్భిణీలు జాగ్రత్త! పొరపాటున కూడా ఈ పండ్లు తినకండి

గర్భిణీలు జాగ్రత్త! పొరపాటున కూడా ఈ పండ్లు తినకండి
Advertisement

Fruits to Avoid in Pregnancy: గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ నెమ్మదించి గ్యాస్, కడుపు ఉబ్బరం , ఎసిడిటీ వంటి సమస్యలు రావడం సహజం. పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. కొన్ని రకాల పండ్లు గర్భిణీలలో గర్భాశయ సంకోచాలకు లేదా తీవ్రమైన జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన ప్రసవం కోసం ఏ పండ్లకు దూరంగా ఉండాలి. గ్యాస్ సమస్యను సహజంగా ఎలా తగ్గించుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

గర్భిణీలు దూరంగా ఉండాల్సిన పండ్లు:
నిపుణుల సూచనల ప్రకారం.. గర్భధారణ సమయంలో ఈ కింది పండ్ల విషయంలో జాగ్రత్త వహించాలి.

Advertisement

1. పచ్చి పైనాపిల్ :
పైనాపిల్‌లో ‘బ్రోమెలైన్’అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భాశయ కండరాలను మృదువుగా చేసి, అకాల ప్రసవానికి లేదా గర్భస్రావానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మొదటి మూడు నెలల్లో దీనికి దూరంగా ఉండటం బెస్ట్.

2. పచ్చి బొప్పాయి:
బాగా పండిన బొప్పాయ సురక్షితమే కానీ.. పచ్చి లేదా అరకొర పండిన బొప్పాయిలో ‘లేటెక్స్’ఉంటుంది. ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల గర్భస్థ శిశువుకు ప్రమాదం కలగవచ్చు.

Advertisement

3. ద్రాక్ష:
కొంతమంది డాక్టర్లు ద్రాక్షలోని ‘రెస్వెరాట్రాల్’ అనే సమ్మేళనం గర్భిణీలలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుందని భావిస్తారు. అలాగే ద్రాక్ష తొక్క అరగడానికి కష్టంగా ఉండి గ్యాస్ సమస్యను పెంచుతుంది.

Also Read: ప్రసవానంతరం పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి? ఆరోగ్యకరమైన చిట్కాలు ఇవే!

గ్యాస్ సమస్యకు చెక్ పెట్టే వంటింటి చిట్కాలు
గర్భిణీలలో గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గించడానికి ఈ క్రింది చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి.

వాము నీరు: ఒక టీస్పూన్ వామును నీటిలో మరిగించి వడకట్టి తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై గ్యాస్ తగ్గుతుంది.

అల్లం టీ: అల్లం వికారాన్ని తగ్గించడమే కాకుండా.. కడుపులో పేరుకుపోయిన గ్యాస్‌ను బయటకు పంపుతుంది.

జీలకర్ర: భోజనం తర్వాత కొద్దిగా వేయించిన జీలకర్ర పొడిని నీటిలో కలుపుకుని తాగితే ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

మజ్జిగ: మజ్జిగలో చిటికెడు ఇంగువ, ఉప్పు కలిపి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చల్లబడి గ్యాస్ సమస్య దరిచేరదు.

గర్భధారణ సమయంలో తీసుకునే. ప్రతి ఆహారం శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే పైనాపిల్, పచ్చి బొప్పాయి వంటి వాటికి దూరంగా ఉంటూ.. ఆపిల్, అరటి, దానిమ్మ వంటి పండ్లను ఎంచుకోవాలి. గ్యాస్ సమస్య వేధిస్తుంటే వెంటనే కెమికల్ మందులు వాడకుండా పైన చెప్పిన వంటింటి చిట్కాలు పాటించండి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. గర్భిణీలు తమ ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా ముందుగా తమ డాక్టరును సంప్రదించడం తప్పనిసరి.

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×