E-Paper
Advertisement

ఇలాంటి స్నేహితుడు కోటికొక్కడుంటాడు… మనసున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన నిజమైన స్టోరీ

ఇలాంటి స్నేహితుడు కోటికొక్కడుంటాడు… మనసున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన నిజమైన స్టోరీ
Advertisement

Feel Good Movie OTT : స్నేహం అంటే కేవలం పార్టీలు చేసుకోవడం కాదు, అవసరంలో ప్రాణం ఇవ్వడం కూడా. అయితే ఎంత మంది ఇలా ఉంటారో తెలియదు గాని, ఒక హాలీవుడ్ సినిమాలో స్నేహం గురించి చాలా గొప్పగా చూపించారు. ఇది గుండెకు హత్తుకునేలా ఉంటుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, స్నేహం గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఒక వైపు క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధి వల్ల ఒక కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంటే, మరోవైపు ప్రాణ స్నేహితుడు తన స్వార్థం చూసుకోకుండా వారికి అండగా ఎలా నిలబడ్డాడో ఈ సినిమా చాలా ఎమోషనల్ గా చూపిస్తుంది. ఇది కేవలం కన్నీళ్లు తెప్పించే సినిమా మాత్రమే కాదు, కష్టకాలంలో నిజమైన స్నేహం ఎలా ఉంటుందో చూపించే ఒక గొప్ప రియల్ స్టోరీ.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ ఫీల్ గుడ్ అమెరికన్ డ్రామా సినిమా పేరు ‘అవర్ ఫ్రెండ్’ (Our Friend). 2019లో వచ్చిన ఈ సినిమాకు గాబ్రియేలా కౌపర్త్‌వైట్ దర్శకత్వం వహించారు. ఇందులో జేసన్ సీగెల్, డకోటా జాన్సన్, కేసీ అఫ్లెక్ లీడ్ రోల్స్ లో నటించారు. మాథ్యూ టేగ్ అనే జర్నలిస్ట్ తన జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను రాసిన ఒక ఆర్టికల్ ఆధారంగా ఈ సినిమాను తీశారు. సాధారణంగా కామెడీ పాత్రలు చేసే జేసన్ సీగెల్, ఈ సినిమాలో ‘డేన్’ అనే సీరియస్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సినిమా స్టోరీ అప్పుడప్పుడు ఫ్లాష్‌బ్యాక్ లోకి, మళ్ళీ ప్రజెంట్ లోకి మారుతూ సాగుతుంది. దీనివల్ల ఆ ముగ్గురి మధ్య ఉన్న స్నేహం ఏళ్ల తరబడి ఎలా బలపడిందో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్, గూగుల్ ప్లే మూవీస్, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మాథ్యూ, నికోల్ అనే భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో జీవితాన్ని హాయిగా సాగిస్తుంటారు. అయితే ఒక్కసారిగా క్యాన్సర్ అనే మహమ్మారి వాళ్ళ సంసారంలోకి వచ్చి పడుతుంది. నికోల్‌కు జబ్బు చేసిందని తెలియగానే ఆ ఇల్లంతా చీకటి అయిపోతుంది. పిల్లల్ని చూసుకోవడం, పెళ్లాం బాధను భరించడం మాథ్యూ వల్ల కాక పిచ్చోడిలా అయిపోతాడు. ఆ టైంలో వాళ్లకు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అప్పుడు వాళ్ల ప్రాణ స్నేహితుడు డేన్ సీన్‌లోకి వస్తాడు. తన పనేదో తను చూసుకోకుండా, స్నేహితుల కష్టాన్ని చూసి తట్టుకోలేక తన సొంత ఊరు, ఉద్యోగం అన్నీ వదిలేసి వీళ్ల ఇంటికి వచ్చేస్తాడు.

ఒక రెండు వారాలు ఉండి వెళ్తానని వచ్చినోడు, ఆ ఇంటికి ఒక పిల్లవాడిలా, ఒక కాపలాదారుడిలా మారిపోయి అక్కడే ఉండిపోతాడు. వంట చేయడం, పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్లడం, నికోల్‌కు ధైర్యం చెప్పడం.. ఇలా ప్రతి పనిలోనూ తోడుంటాడు. చివరికి నికోల్ చనిపోయే వరకు డేన్ ఆ కుటుంబాన్ని వదిలిపెట్టడు. ఈ రోజుల్లో సొంత తమ్ముడు, అన్న కూడా రాని కష్టకాలంలో, ఒక స్నేహితుడు తన జీవితాన్ని త్యాగం చేసి మరీ వాళ్ల కోసం నిలబడటం ఈ కథలో హైలైట్.

Advertisement

Read Also : మైండ్ బ్లాకయ్యే హత్యలు… ఐయండిబిలో 8 రేటింగ్ తో వెన్నులో వణుకు పుట్టించే క్లైమాక్స్

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×