E-Paper
Advertisement

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
Advertisement

Ultra Processed Foods: మనం రోజూ తినే జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి మంచిది కాదనే మాట తరచూ వింటూనే ఉంటాం. అయితే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ (కొలోరెక్టల్ క్యాన్సర్) వస్తుందా లేదా అనే అంశంపై అమెరికాలో దాదాపు 4.6 లక్షల మందిపై ఒక పెద్ద అధ్యయనం జరిగింది. ఈ పరిశోధనలో అల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్స్ అన్నింటినీ ఒకేలా చూడలేమని, ఒక్కో ఆహార పదార్థం ఒక్కోలా పనిచేస్తుందని సైంటిస్టులు గుర్తించారు.

మొత్తంగా చూస్తే ప్రమాదం లేనట్టే:

ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి ఆహారపు అలవాట్లను పరిశీలిస్తే.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే వారికి, తక్కువగా తినే వారితో పోలిస్తే పేగు క్యాన్సర్ వచ్చే ముప్పులో పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. అంటే ప్యాక్ చేసిన ఆహారాలు అన్నీ కూడా నేరుగా క్యాన్సర్‌కు కారణమవుతాయని చెప్పలేం. డయాబెటిస్, శరీర బరువు వంటి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నా ఫలితాల్లో పెద్దగా మార్పు రాలేదు.

Advertisement

Also Read: పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

కొన్నిటితో ముప్పు.. మరికొన్నిటితో ఊరట:

ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను విడివిడిగా విశ్లేషించినప్పుడు విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి. ప్రాసెస్ చేసిన మాంసం, చేపల పదార్థాలు (ప్రాసెస్డ్ మీట్) ఎక్కువగా తిన్న వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం 10 శాతం పెరిగింది. మరోవైపు కొన్ని రకాల ప్యాక్ చేసిన బ్రెడ్లు, బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్, డెయిరీ ఉత్పత్తులు తిన్న వారిలో క్యాన్సర్ ముప్పు కాస్త తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మాంసం ఏ రూపంలో తిన్నా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది.

మారిన ఆహార అలవాట్లు:

Advertisement

మనం తినే ఆహారంలో 10 శాతం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌ను తగ్గించి, దానికి బదులుగా ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం 2 శాతం వరకు తగ్గుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. ఇది పెద్ద మార్పు కాకపోయినప్పటికీ.. సహజ సిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం ఎప్పుడూ మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. పీచు పదార్థాలు, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం క్యాన్సర్ నుంచి రక్షణ ఇస్తుందని స్పష్టమవుతోంది.

మనం తెలుసుకోవాల్సిన విషయం:

ఈ పరిశోధన కేవలం ఆహార అలవాట్లు, క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే చూపించింది తప్ప, పలానా ఆహారమే క్యాన్సర్‌కు కారణమని ఖచ్చితంగా నిరూపించలేదు. కాబట్టి.. ప్రాసెస్ చేసిన ఆహారాలన్నీ హానికరం అని భయపడాల్సిన పనిలేదు. అయితే ప్యాక్ చేసిన మాంసానికి దూరంగా ఉంటూ.. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే తాజా ఆహారాన్ని రోజూ తీసుకోవడమే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Also Read: మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

Tags

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

Big Stories

Advertisement
×