E-Paper
Advertisement

Drumstick: ఈ సమస్యలు ఉన్నవాళ్లు మునక్కాయల్ని తింటే అంతే సంగతులు!

Drumstick: ఈ సమస్యలు ఉన్నవాళ్లు మునక్కాయల్ని తింటే అంతే సంగతులు!
Advertisement

Drumstick: సీజనల్‌గా దొరికే పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు వైద్య నిపుణులు. ఈ క్రమంలో శీతాకాలంలో అందరూ ఇష్టపడి తినే కూరగాయల్లో మునక్కాయలు మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే.. వీటిలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మునక్కాయల్లోని కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు శీతాకాలంలో వచ్చే అనేక రోగాలకు ఔషధంలా పనిచేస్తాయి. అయితే, అన్ని కూరగాయల మాదిరిగానే మునక్కాయల్లోనూ కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్లు మునక్కాయలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

గర్భిణీ స్త్రీలకు సురక్షితం కాదు:

మునక్కాయలను కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీలు అస్సలు తినకూడదు. ఎందుకంటే.. మునక్కాయలు అధికంగా తీసుకోవడం వలన గర్భస్రావానికి దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే.. పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా మునక్కాయ వంటలకు దూరంగా ఉండటం మంచిది. దీంతోపాటు నెలసరి సమయంలో అధిక రక్తస్రావ సమస్యలున్న స్త్రీలు కూడా మునక్కాయలను ఎక్కువగా తినకూడదని సూచిస్తున్నారు.

Advertisement

Read Also: దీన్నింకా మసాలా అనుకుంటున్నారా.. శీతాకాలంలో నల్ల మిరియాలు తీసుకుంటే ఫుల్ హెల్త్!

గుండె వేగాన్ని తగ్గిస్తుంది:

మునక్కాయల్లో ఉండే ఆల్కలాయిడ్ అనే పదార్థం గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించగలదు. దీని కారణంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి అలాంటి వాళ్లు మునక్కాయలు మితంగా తీసుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. అలాగే ఈ మునక్కాయలు కొందరిలో రక్తపోటును తగ్గిస్తాయి కాబట్టి.. తక్కువ రక్తపోటు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

అలెర్జీ తీవ్రతను పెంచుతుంది:

Advertisement

గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, అల్సర్ సమస్యలు ఉన్నవాళ్లు మునక్కాయలను తింటే.. గ్యాస్, డయేరియా వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. అంతేకాదు.. హైపర్ సెన్సిటివిటీ సమస్య ఉన్నవాళ్లు కూడా మునక్కాయలు తింటే శరీరమంతటా చికాకు లేదా వాపు వంటి ప్రమాదకరమైన అలెర్జీ ప్రతిచర్యలు కలగవచ్చు. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు కూడా మునగక్కాయలను తినడం తగ్గించాలని లేదా నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే.. మునక్కాయల్లో ఉన్న ఆల్కలాయిడ్ అనే పదార్థం థైరాయిడ్ సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంది.

Read Also: తగ్గని వ్యాధులను తగ్గించే తానికాయ.. ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×