E-Paper
Advertisement

Coconut Water: ప్రతి తల్లికీ ఉండే సందేహం.. ఆ వయసు పిల్లలకు కొబ్బరినీళ్లు ఇవ్వడం కరెక్టేనా?

Coconut Water: ప్రతి తల్లికీ ఉండే సందేహం.. ఆ వయసు పిల్లలకు కొబ్బరినీళ్లు ఇవ్వడం కరెక్టేనా?
Advertisement

Coconut Water: కొబ్బరి నీళ్లు మన శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో కీలకంగా పనిచేస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే, ఏడాదిలోపు పిల్లలకు కొబ్బరి నీళ్లు సురక్షితమేనా? అని తల్లులకు ఎప్పటి నుంచో ఉన్న సందేహం. దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కొబ్బరి నీళ్లు ఇవ్వాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డారు. ఎందుకుంటే.. ఏడాదిలోపు పిల్లల జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి.. వీళ్ల విషయంలో కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఈ నేపథ్యంలో ఏడాదిలోపు చిన్నారులకు కొబ్బిరి నీళ్లు ఇవ్వడం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ఆ వయసు పిల్లలకు అస్సలొద్దు:

ఏడాదిలోపు పిల్లలకు జీర్ణవ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు కనుక,.. వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణుల ఏమంటున్నారంటే.. 6 నెలల్లోపు పిల్లలకు కొబ్బరి నీళ్లు అస్సలు ఇవ్వకూడదట. ఈ వయసులో శిశువులకు తల్లిపాలే దివ్యౌషధం. తల్లిపాలు అన్ని పోషకాలను కలిగి ఉంటాయి కాబట్టి.. 6 నెలల కంటే ముందు ఏ విధమైన ద్రవ పదార్థాలు, రసాలు, చక్కెర, ఉప్పు లేదా తేనెను కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే.. ఇవి శిశువుల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Advertisement

Read Also: పరీక్షల సమయంలో పిల్లల జ్ఞాపకశక్తి‌ని పెంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే!

సప్లిమెంట్లుగా మాత్రమే:

ఇక ఆరు నెలల కంటే ఎక్కువ వయసు కలిగిన చిన్నారులకు కొబ్బరి నీళ్లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 6 నెలల్లోపు పిల్లలకు కొబ్బరి నీళ్లు ఎప్పుడూ తాజాగా ఉన్నవే ఇవ్వాలి. మార్కెట్‌లో లభించే ప్యాక్ చేసిన లేదా ఫ్లేవర్డ్ కొబ్బరి నీళ్లని అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే.. వాటిలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశాలు ఎక్కువ. దీంతో పిల్లలకు గ్యాస్, అతిసారం, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ ముందే ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే.. మొత్తానికే కొబ్బరి నీళ్లు ఇవ్వకపోవడమే ఉత్తమం. 6 – 12 నెలల శిశువులకు కొబ్బరి నీళ్లను సప్టిమెంటుగా మాత్రమే ఇవ్వాలి. రోజుకోసారి లేదా వారంలో నాలుగు సార్లు ఇస్తే సరిపోతుంది.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×