E-Paper
Advertisement

Donkeys Pulls Car: థార్ ను లాక్కెళ్లిన గాడిదలు.. మహీంద్రా రియాక్ట్ కాలేదా?

Donkeys Pulls Car: థార్ ను లాక్కెళ్లిన గాడిదలు.. మహీంద్రా రియాక్ట్ కాలేదా?
Advertisement

Viral Video: మహీంద్రా కంపెనీ నుంచి విడుదలైన బెస్ట్ కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది థార్. దేశ వ్యాప్తంగా ఈ కార్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కానీ, కొంత మంది వినియోగదారులు ఈ కార్లలో పలు సమస్యలు ఉన్నట్లు చెప్తున్నారు. తాజాగా ఓ థార్ ఓనర్ తన కోపాన్ని కాస్త వెరైటీగా వెళ్లగక్కే ప్రయత్నం చేశాడు కూడా. థార్ ను గాడిదలకు కట్టి.. బ్యాండ్ మేళంతోని మహీంద్రా షోరూమ్ వరకు లాక్కెళ్లాడు. ప్రస్తుతం ఈఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ఈ ఘటనపై స్పందించాడా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?  

పూణేలోని జున్నార్‌ కు చెందిన గణేష్ సంగ్డే  కొద్ది కాలం క్రితం మహీంద్రా థార్‌ ను కొనుగోలు చేశాడు. తన కారు వాష్ చేసినప్పడు లోపలికి వాటర్ లీక్ అవుతుందని, ఇంజిన్ ఎక్కువగా శబ్దం చేస్తుందని షో రూమ్ దగ్గర ఫిర్యాదు చేశాడు. చాలాసార్లు ఈ విషయాన్ని సంబంధిత మహీంద్రా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలోనే మహీంద్రా కంపెనీకి తన నిరసన తెలియజేయాలి అనుకున్నాడు. సంగ్డే థార్ డీలర్‌ను విమర్శిస్తూ పెద్ద పోస్టర్లను SUV మీద అతికించాడు. అయినా, తన సమస్య తీర్చకపోవడంతో తాజాగా థార్ ను గాడిదలకు కట్టి, బ్యాండ్ మేళంతో వాకాడ్‌ ఏరియాలో తాను కొనుగోలు చేసిన సహ్యాద్రి మోటార్స్‌ షో రూమ్ దగ్గరికి లాక్కెళ్లాడు. తన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశాడు.

గణేష్ సంగ్డే  ఏమన్నాడంటే?

Advertisement

మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాకు తన ఆవేదన తెలియాలనే ఇలా చేస్తున్నట్లు గణేష్ సంగ్డే చెప్పారు. “ఆనంద్ మహీంద్రాకు దాదాపు ప్రతి అంశం మీద ఒక అవగాహన ఉంది. థార్ లోని సమస్యల గురించి అతనికి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికైనా, తన కారులోని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాను” అని చెప్పుకొచ్చాడు.

నెటిజన్లు ఏమంటున్నారంటే?  

Advertisement

ఈ ఘటనపై నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మహీంద్రా డీలర్ల ప్రవర్తన బాగాలేదని కామెంట్స్ పెడుతున్నారు. “ఆనంద్ మహీంద్రా షోరూమ్, సర్వీస్ మేనేజర్లపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలి. వారి అహంకారం మహీంద్రా ప్రతిష్టను దెబ్బతీస్తుంది. కస్టమర్లను సాటిస్ ఫై చేయకపోతే కంపెనీ మనుగడ సాధించడం కష్టం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “మహీంద్రాలో సర్వీసులు చాలా వీక్ గా ఉన్నాయి. నేను ఒక నెల నుంచి ఇబ్బంది పడుతున్నాను” అని మరో నెటిజన్ కామెంట్ రాశాడు. “ఓ మహీంద్రా థార్ అభిమానిగా నేను ఆనంద్ మహీంద్రా రియాక్షన్ చూడాలని కోరుకుంటున్నాను” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కొనసాగుతోంది.  ఆనంద్ మహీంద్రా ఈ సమస్యకు ఎలా పరిష్కారం చూపిస్తాడనేది చూడాలి.

Read Also: రన్నింగ్ ఆటో మీద దూకి, అమ్మాయిని కాపాడిన హిందూ హీరో!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×