E-Paper
Advertisement

Vehicle fitness test fees: వాహనదారులకు కేంద్రం షాక్.. వాహనాల ఫీజు రూ. 2,500 నుంచి ఏకంగా రూ. 25,000కి పెంపు!

Vehicle fitness test fees: వాహనదారులకు కేంద్రం షాక్.. వాహనాల ఫీజు రూ. 2,500 నుంచి ఏకంగా రూ. 25,000కి పెంపు!
Advertisement

Vehicle fitness test fees: పాత వాహన యజమానులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా వాహనాల ఫిట్‌నెస్ పరీక్ష ఫీజులను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీలలో ఈ పెంపు పది రెట్ల వరకు ఉండటం గమనార్హం. కేంద్ర మోటారు వాహన నియమాల (ఐదవ సవరణ) కింద చేసిన ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రోడ్ల పైనుంచి పాత, అసురక్షిత వాహనాలను తొలగించడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సవరణలలో అత్యంత ముఖ్యమైన మార్పు వయో పరిమితిని తగ్గించడం. గతంలో 15 ఏళ్లు దాటిన వాహనాలకు అధిక ఫీజులు వర్తింపజేయగా, ఇప్పుడు ఆ పరిమితిని 10 సంవత్సరాలకు తగ్గించారు. అంతేకాకుండా, వాహనాల వయసు ఆధారంగా మూడు కొత్త వర్గాలను ప్రవేశపెట్టారు: 10-15 ఏళ్లు, 15-20 ఏళ్లు, 20 ఏళ్లకు పైబడిన వాహనాలు. వయసు పెరిగే కొద్దీ ఫీజుల భారం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ నిబంధనలు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు (LMV), మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు సహా అన్ని కేటగిరీలకు వర్తిస్తాయి.

Advertisement

ఫీజుల పెంపు ప్రభావం ముఖ్యంగా వాణిజ్య వాహనాలపై తీవ్రంగా ఉంది. 20 ఏళ్లు దాటిన భారీ వాణిజ్య వాహనాలకు (ట్రక్కులు, బస్సులు) ఫిట్‌నెస్ పరీక్ష ఫీజును గతంలోని రూ. 2,500 నుంచి ఏకంగా రూ. 25,000కి పెంచారు. అదేవిధంగా, 20 ఏళ్లు దాటిన మీడియం కమర్షియల్ వాహనాలకు ఫీజు రూ. 1,800 నుంచి రూ. 20,000కి పెరిగింది. ప్రైవేట్ వాహనాల విషయంలోనూ భారం తప్పలేదు. 20 ఏళ్లు పైబడిన తేలికపాటి మోటారు వాహనాలకు (కార్లు) ఫీజును రూ. 15,000గా, 20 ఏళ్లు దాటిన త్రిచక్ర వాహనాలకు రూ. 7,000గా నిర్ణయించారు. 20 ఏళ్లు దాటిన ద్విచక్ర వాహనాల ఫీజు రూ. 600 నుంచి రూ. 2,000కి పెరిగింది.

15 సంవత్సరాల లోపు వాహనాలకు కూడా ఫీజులు పెరిగాయి. కొత్త రూల్ 81 ప్రకారం, ఫిట్‌నెస్ సర్టిఫికేషన్ కోసం మోటార్‌సైకిల్‌కు రూ. 400, తేలికపాటి మోటారు వాహనాలకు (కార్లు) రూ. 600, మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలకు రూ. 1,000 చొప్పున వసూలు చేయనున్నారు.

Advertisement

Read Also: Free Domestic Flights: పర్యాటకులకు విమానాల్లో ప్రయాణం ఉచితం.. థాయ్‌లాండ్ అదిరిపోయే ఆఫర్!

 

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×