E-Paper
Advertisement

Clove Benefits: చలికాలంలో లవంగాలు తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?

Clove Benefits: చలికాలంలో లవంగాలు తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?
Advertisement

Clove Benefits: లవంగాలు వంటగదిలో ఉపయోగించే మసాలా దినుసు మాత్రమే కాదు.. శక్తివంతమైన ఔషధం కూడా. ఆయుర్వేదంలో.. లవంగాలు జీర్ణక్రియ నుంచి రోగ నిరోధక శక్తి వరకు ప్రతిదానికీ చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. చలికాలంలో వీటిని తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండాఈ సీజన్లో వ్యాధుల బారిన పడకుండా కూడా చేస్తాయి. ఆహార పదార్థాల రుచిని పెంచడానికి మాత్రమే లవంగాలను ఉపయోగిస్తారు కానీ వీటిని రోజువారీ ఆహారంలో సరైన పరిమాణంలో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

లవంగాలు తినడం వల్ల కలిగే 6 గొప్ప ప్రయోజనాలు:

జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది:

Advertisement

లవంగాలు జీర్ణ సమస్యలు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. వీటి యాంటీఆక్సిడెంట్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయ పడతాయి. భోజనం తర్వాత లవంగాలను నమలడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు తరచుగా లవంగాలు తినడం అలవాటు చేసుకోవాలి.

పంటి నొప్పులు, దుర్వాసన :

లవంగాలలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. లవంగాలు నమలడం వల్ల పంటి నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది నోటిలోని బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. అంతే కాకుండా నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది:

లవంగాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడతాయి. లవంగాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. అంతే కాకుండా శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. మారుతున్న సీజన్లలో లవంగాలు తినడం వల్ల జలుబు, దగ్గును నివారించవచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తరచుగా లవంగాలు తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. 

జలుబు, దగ్గుకు ప్రయోజనకరం:

చలికాలంలో లవంగాలు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అవి గొంతు నొప్పి, దగ్గు, కఫాన్ని తగ్గిస్తాయి. గోరు వెచ్చని నీటితో లవంగాలు తినడం వల్ల గొంతు క్లియర్ అవుతుంది. అంతే కాకుండా శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: ఈ లిస్ట్‌లో ఉన్నారా? అయితే గ్రీన్ టీ తాగడం వెంటనే ఆపేయండి!

రక్తంలో చక్కెర స్థాయి:

కొన్ని పరిశోధనల ప్రకారం..లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయ పడతాయి. అవి ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగు పరుస్తాయి. అంతే కాకుండా ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే.. వాటిని మితంగా తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారు డైలీ లవంగాలు తినడం అలవాటు చేసుకోవాలి.

శరీర వెచ్చదనానికి  మేలు:

లవంగాలు శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడంలో సహాయ పడుతుంది. చల్లని చేతులు, కాళ్ళకు కూడా లవంగాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

Also Read: బీపీని అదుపులో ఉంచే సింపుల్ టిప్స్.. ఇక మందుల జోలికి వెళ్లక్కర్లేదు!

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×