E-Paper
Advertisement

Dhurandhar Ban : ధురందర్‌పై బ్యాన్ వద్దు… పీఎం మోడీకి నిర్మాతలు లేఖ

Dhurandhar Ban : ధురందర్‌పై బ్యాన్ వద్దు… పీఎం మోడీకి నిర్మాతలు లేఖ
Advertisement

Dhurandhar Ban : బాలీవుడ్‌లో రిలీజ్ అయిన ధురందర్ మూవీ రికార్డులను కొల్లగొడుతుంది. కేవలం ఒక్క భాషలోనే రిలీజ్ అయి… అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా ధురందర్ నిలిచింది. ఇప్పటి వరకు ఈ మూవీ 1276 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ టైంలో… ధురందర్ మూవీపై ఉన్న బ్యాన్‌‌పై ఎత్తివేయడానికి సాయం చేయాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడికి బాలీవుడ్ నిర్మాతలు లేఖ రాశారు.

బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ధురందర్ మూవీ గతేడాది డిసెంబర్ 05న రిలీజ్ అయింది. రణవీర్ సింగ్ హీరో కాబట్టి.. కొంత అంచనాలు ఉండేవి. కానీ, ఆ సినిమా స్టోరీ… స్క్రీన్ ప్లే వల్ల బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా 3 గంటల 34 నిమిషాలు ఉన్నా.. ఆడియన్స్ థియేటర్ వచ్చి సినిమా చూస్తున్నారు.

Advertisement

ఇండియాలో ఇంత సక్సెస్ అవుతున్న ఈ సినిమాపై కొన్ని దేశాలు బ్యాన్ విధించాయి. ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కువగా ఉండే గల్ఫ్ కంట్రీస్‌లో ఈ సినిమా ప్రస్తుతం ఆడటం లేదు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఈ సినిమా ఉండటంతో అక్కడ ప్రభుత్వాలు ఈ సినిమాను బ్యాన్ చేశాయి. ప్రస్తుతం ధురందర్ మూవీపై… ఖతర్ యూఏఈ, సౌదీ అరేబియా, ఓమాన్, కువైట్, బెహ్రయిన్ లాంటి గల్ఫ్ కంట్రీస్‌లో బ్యాన్ ఉంది. ఈ దేశాల్లోనే ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు.

ఈ నేపథ్యంలో ఈ గల్ఫ్ కంట్రీస్‌లో ధురందర్ మూవీపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేశాల చూడాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి బాలీవుడ్ నిర్మాతల మండలి లేఖ రాసింది. భారతదేశం గర్వించదగ్గ మూవీగా ధురందర్ ఉందని… అలాంటి మూవీని భారతీయులు అందరూ చూడాలని అన్నారు.

Advertisement

అలాగే, తమ సినిమాను ఎక్కడ అయినా… థియేటర్స్‌లో రన్ చేసుకోవచ్చు అని, సినిమాలో ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేవని సెన్సార్ బోర్డు ఆమోదించి తమకు అనుమతి ఇచ్చిందని కూడా లేఖలో ప్రస్తావించారు. ఆయా దేశాలతో మాట్లాడి… తమ సినిమాపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేశాల చూడాలని లేఖలో కోరారు.

కాగా, ధురందర్ మూవీ ఇప్పటికే 1276 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక కేవలం హిందీ రాష్ట్రాల్లోనే 840 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే 6 వారాలు ముగిసినా… ఈ సినిమాకు ఇంకా 3000 లకు పైగా స్క్రీన్స్ ఉన్నాయంటే.. ఎంత ప్రేక్షకాధరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Related News

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

వెండితెర పైకి ‘రఘుకుల తిలకరారా’ సాంగ్..

Big Stories

Advertisement
×