E-Paper
Advertisement

Blood Pressure: బీపీని అదుపులో ఉంచే సింపుల్ టిప్స్.. ఇక మందుల జోలికి వెళ్లక్కర్లేదు!

Blood Pressure: బీపీని అదుపులో ఉంచే సింపుల్ టిప్స్.. ఇక మందుల జోలికి వెళ్లక్కర్లేదు!
Advertisement

Blood Pressure: బీపీ అకస్మాత్తుగా పెరిగినప్పుడు శరీరంపై చాలా ఒత్తిడి కలుగుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే హై బీపీ సమస్యలు ఉన్న వారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు లేకుండా తక్షణమే రక్తపోటును తగ్గించుకోవడానికి కొన్ని పద్ధతులు, లైఫ్ స్టైల్ మార్పులు సహాయ పడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

హైబీపీ తగ్గించే మార్గాలు :

1. లోతైన శ్వాస ప్రక్రియ:

Advertisement

బీపీ పెరిగినప్పుడు ఒత్తిడిని తగ్గించడానికి ‘డీప్ బ్రీతింగ్’ చేయడం మంచిది. ఇందుకోసం ప్రశాంతంగా కూర్చుని లేదా పడుకుని, కళ్లు మూసుకోవాలి. తర్వాత ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకుని, నోటి ద్వారా అంతకంటే నెమ్మదిగా వదలండి. ఇలా కనీసం 5 నిమిషాలు చేయడం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి.

2. ఎక్కువ నీరు తాగడం:

డీహైడ్రేషన్ వల్ల కూడా బీపీ పెరుగుతుంది. రక్తం చిక్కబడటం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఒకటి లేదా రెండు గ్లాసుల చల్లని నీరు తాగడం వల్ల శరీరం చల్లబడి, రక్త ప్రసరణ క్రమబద్ధం అవుతుంది.

3. డార్క్ చాక్లెట్ :

బీపీ పెరిగినప్పుడు ఒక చిన్న ముక్క డార్క్ చాక్లెట్ (కనీసం 70% కోకో ఉన్నది) తినడం వల్ల రక్తనాళాలు వెడల్పు అవుతాయి. అలాగే.. అరటిపండు వంటి పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం (ఉప్పు) ప్రభావం తగ్గి బీపీ అదుపులోకి వస్తుంది.

4. విశ్రాంతి తీసుకోవడం:

మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు బీపీ పెరిగితే.. వెంటనే అన్ని పనులు ఆపేసి ప్రశాంతమైన చోట పడుకోండి. కండరాలను వదిలేసి ప్రశాంతంగా ఉండటం వల్ల సిస్టోలిక్ బీపీ వెంటనే తగ్గే అవకాశం ఉంది.

5. గోరు వెచ్చని నీటి స్నానం:

గోరువె చ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఇది రక్త ప్రవాహాన్ని సులభతరం చేసి రక్తపోటును తగ్గిస్తుంది. అయితే నీరు మరీ వేడిగా ఉండకూడదు.

Also Read: హార్ట్ ఎటాక్ దరిచేరకూడదా? అయితే రోజుకు 30 నిమిషాల నడక మస్ట్!

ముఖ్యమైన జాగ్రత్తలు:

ఉప్పును తగ్గించండి: బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ రోజంతా ఉప్పుకు దూరంగా ఉండండి.

కెఫీన్ వద్దు: టీ, కాఫీలు రక్తపోటును మరింత పెంచుతాయి. కాబట్టి వాటిని తాగకండి

ధూమపానం/మద్యపానం: బీపీ పెరిగినప్పుడు ఇవి ప్రాణాపాయానికి దారితీయవచ్చు.

ఎప్పుడు డాక్టరును సంప్రదించాలి ?

బీపీ పెరిగినప్పుడు తీవ్రమైన తలనొప్పి, కంటిచూపు మందగించడం, గుండెనొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. ఇంటి చిట్కాల కోసం ప్రయత్నించకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లడం మంచిది.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×