E-Paper
Advertisement

Cowpeas: ఎంతసేపూ చికనూ మటనేనా.. అలసందల్లోనూ పోషకాలు మెండుగుంటాయ్!

Cowpeas: ఎంతసేపూ చికనూ మటనేనా.. అలసందల్లోనూ పోషకాలు మెండుగుంటాయ్!
Advertisement

Cowpeas: మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఎప్పుడూ అందుబాటులో ఉండే అలసంద (బొబ్బర్లు)ల్లో మంచి పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని. ఈ బొబ్బర్లు మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో ఎరుపు, తెలుపు బొబ్బర్ల రకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మధుమేహులు వీటిని తరచూ తీసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. ఈ బొబ్బర్లలో విటమిన్‌ ఎ, బి1, బి2, బి3, బి5, బి6, సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. అలాగే, ఐరన్, రాగి, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. ఈ పోషకాలు మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి ఎంతగానో తోడ్పడుతాయి.

శాఖాహారులకు బెస్ట్ ఛాయిస్:

ఈ బొబ్బర్లు అనేవి.. ప్రోటీన్లతో నిండి ఉంటాయి. దీనిని నాన్ వెజ్ తినని శాకాహారులకు ఉత్తమమైన ప్రొటీన్ ఎంపికగా చెప్పవచ్చు. 100 గ్రాముల ఈ పప్పులో 24 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. దీంతో శరీరంలోని కండరాలు బలోపేతం అవుతాయి. అలాగే పునర్నిర్మాణానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలసందలను క్రమం తప్పకుండా తీసుకుంటే.. మన శరీరంలో ప్రొటీన్ లోపం ఉండదిక.

గుండె ఆరోగ్యం పదిలం:

Advertisement

బొబ్బర్లలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని నిరంతరం రక్షిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. మొత్తానికి అలసందలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Read Also: ఈ సందేహం మీకూ ఉందా.. పీరియడ్స్ టైంలో తలస్నానం చేయాలా? వద్దా?

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

Advertisement

అలసందల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో.. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పీచు వల్ల అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దరిచేరవు. అంతే కాకుండా.. ప్రేగు పనితీరును కూడా ఈ బొబ్బర్లు మెరుగుపరుస్తాయి. అలాగే మలబద్ధకం సమస్య ఉంటే క్రమంగా తగ్గుతుంది.

రక్తహీనతను నివారిస్తుంది:

అలసందల్లో ఐరన్, కాల్షియం అధికం. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. శరీరంలో రక్త పరిమాణం మెరుగుపడుతుంది. అలాగే రక్తహీనతను నివారించడంలో అలసందలు చాలా ఉపయోగపడుతుంది. దీనిలో పోషకాలు శరీరానికి శక్తిని అందించి అలసటను తగ్గిస్తాయి.

మధుమేహులకు మేలు:

ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వాళ్లు తమ రోజూవారీ ఆహారంలో అలసందలను భాగం చేసుకుంటే.. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడమే కాకుండా.. మధుమేహం సంబంధిత సమస్యలను నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది.

Read Also: దానిమ్మతో అదిరే అందం.. ఇలా వాడారంటే దగ దగా మెరిసిపోవాల్సిందే!

Related News

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×