Weight Loss: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి కొత్త ఏడాది రిజల్యూషన్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడం కూడా ఉండొచ్చు. కానీ కొన్ని సార్లు జిమ్‌లలో గంటల తరబడి చెమటలు చిందించినా అంతే కాకుండా ఆహారం తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. తక్కువ తినండి- ఎక్కువ నడవండి అనే సూత్రం కూడా అందరికీ పని చేయదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే కానీ..బరువు తగ్గడానికి అది ఒక్కటే పనిచేయదని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.
వాకింగ్:
మనం ఆరోగ్యంగా ఉండటానికి వాకింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వివిధ రకాల వ్యాయామాలు కూడా శరీరాన్ని ధృడంగా మారుస్తాయి. అనేక వ్యాధులను కూడా వ్యాయామం నిరోధించగలుగుతుంది. కానీ బరువు తగ్గడానికి మాత్రం వ్యాయామం ఒకటే ఆశించిన ఫలితాలను ఇవ్వదని నిపుణులు చెబుతున్నారు.
కేలరీలు:
బరువు తగ్గాలంటే తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు శక్తిని కూడా ఎక్కువగా ఖర్చు చేయాలి. ఇది సిద్దాంతపరంగా నిజమే అయినప్పటికీ అమలు చేయడం చాలా కష్టం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనం తినే ఆహారం తగ్గించినప్పుడు శరీరం దానిని సమస్యగా భావిస్తుంది. ఒకే సారి ఆహారం తగ్గించడం వల్ల వివిధ రకాల సమస్యలు వస్తాయి. ఇదిలా ఉంటే ఎక్కువ సార్లు ఆకలిని నియంత్రించడం కూడా చాలా కష్టం.
అధిక బరువు:
కొంత మంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా బరువు తగ్గకపోవచ్చు. దీనికి జన్యువులు కూడా కారణం కావచ్చు. ఎందుకంటే మన జన్యవుల్లో కొవ్వు నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా ఉండి ఉంటుంది. అందుకే బరువు తగ్గడానికి కొంత మందిలో ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్ని టిప్స్ పాటించినా బరువు తగ్గరు.ఇదిలా ఉంటే కొంత మంది కష్టపడి బరువు తగ్గినా కూడా కొన్ని రోజులకే తిరిగి మునుపటి బరువుకు చేరుకుంటారు. దీనికి కారణం మన శరీరం ఒక జ్ఞాపకంగా మన గరిష్ట బరువును నిల్వ ఉంచుకుటుందని ఒక పరిశోధనలో రుజువైంది. బరువు తగ్గిన వెంటనే శరీరం ఆకలి హార్మోన్లను విడదల చేయడం ద్వారా ఎక్కువగా తింటారు. ఫలితంగా మునుపటికి బరువుకు చేరుకుంటారు.
Also Read: ఇది ఒక్క సారి వాడితే.. జన్మలో తెల్ల జుట్టు రాదు
జన్యువులు:
బరువు తగ్గడంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడాలు ఉంటాయి. దీనికి కారణం జన్యు సిద్ధత. ఒక వ్యక్తి సులభంగా బరువు తగ్గగలిగితే మరొకరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం ఉండదు. ఇది వారి నియంత్రణలో లేని విషయం. అందుకే అందరికీ ఒకే రకమైన డైట్ ప్లాన్ వ్యాయామం ఉపయోగ పడకోవచ్చు.
బరువు పెరగడం అనేది బద్ధకం వల్ల వచ్చే సమస్య కాదు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. మనం నివసించే వాతావరణంతో పాటు జన్యువులు శరీరం కొవ్వును నిల్వ చేసుకునే విధానం వంటివి మాత్రమే బరువును నిర్ణయిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలని అనుకునే వారు కేవలం వ్యాయామం పై మాత్రమే కాకుండా శరీర తత్వాన్ని అర్థం చేసుకోవాలి. నిపుణుల సలహాతో లైఫ్ స్టైల్ మార్పులు, ఒత్తడిని తగ్గించుకోవడంతో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.