E-Paper
Advertisement

Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్‌ను మాయం చేసే మోస్ట్ పవర్‌ఫుల్ టిప్స్.. ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు!

Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్‌ను మాయం చేసే మోస్ట్ పవర్‌ఫుల్ టిప్స్.. ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు!
Advertisement

Stretch Marks: పొట్టమీద స్ట్రెచ్ మార్క్స్‌ ఏర్పడటం అనేది బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి తల్లీ ఎదుర్కొనే సాధారణ సమస్య. కొంతమంది దీని కోసం వేలల్లో ఖర్చుపెడతూ.. రకరకాల ఔషధాలను వాడుతుంటారు. ఇలా మందులు వాడిన తర్వాత కూడా ఎలాంటి ఫలితమూ లేకపోగా.. ఆ మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ బారిన పడతారు. ఎవరో చెప్పారని స్ట్రెచ్ మార్క్స్ కోసం ఏవేవో మందులు వాడటం వలన ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గర్భం దాల్చిన మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్‌ను క్రమంగా తగ్గించడం అంత కష్టమైన విషయమేమీ కాదు. ముఖ్యంగా అధిక బరువు ఉన్న మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటాయి. చర్మం అతిగా సాగిపోవడం వల్ల ఏర్పడే ఈ గీతలను తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే నిపుణులు ఏమంటున్నారంటే.. సహజ పద్ధతుల ద్వారా వీటిని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉందంటున్నారు.

Advertisement

Also Read: అతిగా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ మింగుతున్నారా? అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే!

స్ట్రెచ్ మార్క్స్‌కు ఇతర కారణాలు:

గర్భవతి అయిన రోజు నుంచి క్రమంగా పొట్ట పరిమాణం పెరుగుతుంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పొట్టలోని కండరాలే కాకుండా చర్మం కూడా విస్తరించాల్సి వస్తుంది. దీంతో చర్మం వేగంగా సాగడం వల్ల కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. తద్వారా పొట్టమీద స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం ప్రారంభం అవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో హార్మోన్ల మార్పులు, అకస్మాత్తుగా బరువు పెరగడం కూడా దీనికి కారణాలుగా మారవచ్చు.

ఇలా క్రమంగా తగ్గించుకోండి:

Advertisement

⇒ పొట్ట మీద మాత్రమే కాదు.. మరింకెక్కడైనా ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా కనుమరుగు కావడం అసాధ్యం అంటున్నారు నిపుణులు. అయితే.. కొన్ని సహజ పద్ధతుల ద్వారా వాటిని కొంతవరకు కనిపించకుండా చేయవచ్చు.

⇒ స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించడానికి కలబంద కీలకంగా పనిచేస్తుంది. దీని కోసం నేచురల్ కలబంద గుజ్జుని స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట రాసి, పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఏర్పడిన గీతలు నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంటుంది.

⇒ అలాగే ఆలివ్‌ ఆయిల్ కూడా స్ట్రెస్ మార్క్స్‌‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పొట్టపై ఏర్పడిన గీతలను క్రమంగా తగ్గించుకోవాలంటే.. కొద్దిగా ఆలివ్ నూనెను వేడి చేసుకుని, మార్క్స్ ఉన్న ప్రదేశంలో మృదువుగా మర్దన చేసుకోవాలి. అలా అరగంట గడిచాక.. వాష్ చేసుకుంటే సరి. ఈ చిట్కాలు పాటించినా.. ఎలాంటి ఫలితమూ లేకపోతే వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల క్రీమ్స్‌, లోషన్స్‌ కూడా ఉపయోగించవచ్చు.

Also Read: ఏడాదంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే.. ఈ అలవాట్లను ఆచరణలో పెట్టేయండి బాస్!

 

Related News

SIR తర్వాత ఓటర్ లిస్ట్‌లో మీ పేరు కనిపించడం లేదా? మళ్లీ నమోదు చేసుకోవడానికి ఇలా చేయండి

వెన్నునొప్పి, మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే ఫిజియోథెరపీ అవసరం

దేవుడిపై బలమైన నమ్మకం.. ఈ తేదీల్లో పుట్టినవారిలో ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ

బ్రేకప్ తర్వాత మళ్లీ డేటింగ్ ఎప్పుడు ప్రారంభించాలి? మళ్లీ ప్రేమలో పడే ముందు ఈ విషయాలు ఆలోచించండి

ఈ విధానంలో భోజనం చేస్తే షుగర్ ఎప్పుడూ పెరగదు.. మధుమేహులకు డాక్టర్ చెప్పిన సింపుల్ చిట్కా

పేరు లేని బంధం.. బ్రేకప్ కూడా కాదు.. అయినా సిచ్యుయేషన్‌షిప్ ఎందుకింత బాధిస్తుంది?

దాని ‘సైజ్’ పెంచుకోడానికి ఇన్‌ఫ్లుయెన్సర్ అత్యాశ.. సర్జరీ సక్సెస్, కానీ..

ఎప్పుడు క్షమాపణ అడగాలి? ఎప్పుడు సంబంధాన్ని తెంచుకోవాలి?.. సంతోషకర జీవితానికి చాణక్యుడి సూచనలు

Big Stories

Advertisement
×