E-Paper
Advertisement

Mohammed Shami: బీహార్ ఎన్నిక‌ల‌పై మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ వివాద‌స్పద వ్యాఖ్య‌లు.. నితీష్ జీ అంటూ !

Mohammed Shami: బీహార్ ఎన్నిక‌ల‌పై మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ వివాద‌స్పద వ్యాఖ్య‌లు.. నితీష్ జీ అంటూ !
Advertisement

Mohammed Shami: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి – జేడీయు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. నితీష్ కుమార్ ఛరిష్మా, ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ పెద్దల ప్రచారంతో.. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలను తలకిందులు చేస్తూ 200 సీట్లకు పైబడి ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగురవేసింది.

Also Read: Shubman Gill: టీమిండియాకు బిగ్ షాక్.. గిల్ రిటైర్డ్ హర్ట్, 4 వికెట్లు డౌన్

Advertisement

ముఖ్యంగా బీహార్ మహిళలలో నితీష్ కుమార్ కి ఉన్న ఓట్ బేస్.. ఈ ఎన్నికలలో ఆయనని విజయతీరాలకు చేర్చింది. ఈ క్రమంలో జెడియు చీఫ్ నితీష్ కుమార్ వరుసగా తొమ్మిదవసారి బీహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని బిజెపి వర్గాలు తెలియజేశాయి.

బీహార్ ఎన్నికలపై మహమ్మద్ షమీ:

బీహార్ ఎన్నికల ఫలితాలపై మహమ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బీహార్ ప్రజలు ఓటు వేయడానికి ముందు ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఈసారి కూడా వారు తమ ప్రభుత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఎన్నుకున్నారు. బీహార్ లోని ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు మొహమ్మద్ షమీ. ఈ వ్యాఖ్యలతో బీహార్ లోని నితీష్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మహమ్మద్ షమీ తన పూర్తి మద్దతును ప్రకటించినట్లు అయ్యింది. ఈ క్రమంలో ఓ ముస్లిమ్ అయ్యుండి ఎన్డీఏకి మద్దతు పలకడమేంటని కొంతమంది సోషల్ మీడియా వేదికగా మొహమ్మద్ షమీపై ట్రోలింగ్స్ చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ మధ్యకాలంలో తరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు మహమ్మద్ షమి. 2018లో భార్య హాసిన్ జహాన్ తో విడిపోయిన తర్వాత అతని వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా మారింది. ఈ కేసులో ఆమెకు నెలవారి జీవనాధారం చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో రంజాన్ ఉపవాసాలను పాటించనందుకు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. అలాగే తాజాగా బీసీసీఐ అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడం కూడా వివాదాస్పదమైంది.

షమీని రిలీజ్ చేసిన SRH:

మహమ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది. షమీ ని ట్రేడింగ్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తోంది.. ఐపీఎల్ 2025లో మహమ్మద్ షమీ ని రూ. 10 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్ దక్కించుకుంది. ఇతడి పై భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ పూర్తిగా షమీ నిరాశపరిచాడు. హైదరాబాద్ తరపున ఆడిన 9 మ్యాచ్ లలో ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

Also Read: Shubman Gill father: సారాతో పెళ్లి రూమ‌ర్స్‌.. గిల్ తండ్రి అదిరిపోయే ఆన్స‌ర్‌, వీడియో వైర‌ల్‌

దీంతో షమీని హైదరాబాద్ జట్టు వద్దనుకుంది. ఐపీఎల్ 2026 రిటెన్షన్ గడువు నవంబర్ 15 {నేటి} తో ముగియనుంది. అయితే ఎంతో అనుభవజ్ఞుడైన మహమ్మద్ షమీని కొనేందుకు లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయంపై ప్రస్తుతం ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలుపడే అవకాశం ఉంది.

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×