E-Paper
Advertisement

Shivaratri Fasting: శివరాత్రి ఉపవాసం.. పండ్లు మొదటగా ఎందుకు తీసుకోవాలో తెలుసా?

Shivaratri Fasting: శివరాత్రి ఉపవాసం.. పండ్లు మొదటగా ఎందుకు తీసుకోవాలో తెలుసా?
Advertisement

Shivaratri Fast: మహా శివరాత్రి నాడు రోజంతా నిరాహారంగా ఉండి, శివయ్యను ఆరాధించడం మన సంప్రదాయం. అయితే.. ఉపవాసం ముగించే సమయంలో చాలామంది తెలియక చేసే పొరపాట్ల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం, వికారం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎక్కవ సమయం పాటు ఖాళీగా ఉన్న జీర్ణవ్యవస్థను ఒక్కసారిగా ఎక్కువ ఆహారంతో ఇబ్బంది పెట్టకూడదు. శివ రాత్రి ఉపవాస విరమణ సమయంలో పాటించాల్సిన నియమాలు, చేయకూడని తప్పుల గురించి తెలుసుకోవడం వల్ల ఆధ్యాత్మిక పుణ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

1. ఒక్కసారిగా భారీ ఆహారం తీసుకోవడం:
చాలా మంది ఉపవాసం విరమించే సమయంలో విపరీతమైన ఆకలితో ఉంటారు. దీనివల్ల అన్నం, కూరలు అని చూడకుండా ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు. సుమారు 24 గంటల పాటు విశ్రాంతిలో ఉన్న జీర్ణ వ్యవస్థపై ఇది అదనపు భారం వేస్తుంది. దీని వల్ల అజీర్ణం, కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. చిన్న మొత్తంలో ఆహారంతో మొదలుపెట్టాలి.

Advertisement

2. నూనె వస్తువులు, మసాలాలు:
ఉపవాసం విడిచిన వెంటనే పకోడీలు, వడలు లేదా అధిక మసాలాలు ఉన్న ఆహారం తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వీటిని తింటే ఎసిడిటీ, గుండెల్లో మంట తీవ్ర మవుతాయి. సాత్విక ఆహారం అంటే తక్కువ ఉప్పు, కారం ఉన్న పదార్థాలకే ప్రాధాన్యత ఇవ్వాలి.

3. కెఫిన్ , కూల్ డ్రింక్స్:
ఉపవాసం ముగిసిన వెంటనే స్ట్రాంగ్ టీ, కాఫీ లేదా ఐస్ కోల్డ్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు. ఇవి కడుపులోని పొరలను చికాకు పెడతాయి. వీటికి బదులుగా గోరు వెచ్చని నీరు లేదా నిమ్మరసం తీసుకోవడం ఉత్తమం.

Advertisement

4. నీరు:
ఉపవాసం విడిచేటప్పుడు గడగడా నీళ్లు తాగేయకూడదు. సిప్ చేస్తూ (గుటకలు వేస్తూ) నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.

5. సరైన పద్ధతి – పండ్లు, ద్రవపదార్థాలు:
ఉపవాసం విరమించేటప్పుడు మొదట అరటి పండు లేదా యాపిల్ వంటి సులభంగా అరిగే పండ్లను తీసుకోవాలి. ఆ తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి ఉడికించిన ఆహారం (కిచిడీ లేదా మెత్తటి అన్నం) తీసుకోవాలి. దీని వల్ల జీర్ణ క్రియ మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి సమయం దొరుకుతుంది.

Also Read: శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే.. ఆశ్చర్యకర లాభాలు !

6. నిద్ర, విశ్రాంతి:
జాగరణ చేసిన తర్వాత ఆహారం తీసుకోగానే వెంటనే పడుకోకూడదు. దీని వల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగదు. భోజనం చేసిన కనీసం రెండు గంటల తర్వాతే విశ్రాంతి తీసుకోవాలి.

7. ప్రోటీన్, ఫైబర్ సమతుల్యత:
ఉపవాసం తర్వాత బలహీనంగా అనిపిస్తే.. పెసరపప్పుతో చేసిన పదార్థాలు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.

మహా శివరాత్రి ఉపవాసం మన అంతర్గత అవయవాలకు రీసెట్ బటన్ లాంటిది. క్రమపద్ధతిలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఉపవాస ఫలితం పూర్తి స్థాయిలో లభిస్తుంది. భక్తి తో పాటు ఆరోగ్యాన్ని కూడా గౌరవించడం పరమ శివుడికి ఇష్టమైన కార్యమే.

Related News

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

Big Stories

Advertisement
×