E-Paper
Advertisement

నిద్రలోనే ఎక్కువ మందికి హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? నిజమిదే !

నిద్రలోనే ఎక్కువ మందికి హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? నిజమిదే !
Advertisement

Heart attack: నిద్రలో గుండెపోటు రావడం అనేది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. సాధారణంగా గుండెపోటు లక్షణాలు మేల్కొని ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్త.యి, కానీ నిద్రలో ఉన్నప్పుడు శరీరం విశ్రాంతి స్థితిలో ఉండటం వల్ల వచ్చే మార్పులను చాలా మంది గుర్తించలేరు. దీనినే ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా అంటారు. సరైన సమయంలో లక్షణాలను గుర్తించకపోతే.. అది ప్రాణాపాయానికి దారి తీస్తుంది. నిద్రలో వచ్చే గుండెపోటు సంకేతాలు ఏంటి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలో గుండెపోటు.. గుర్తించలేనంత నిశ్శబ్దంగా వచ్చే ఈ సంకేతాలు తెలుసా?
గుండెపోటు ఎప్పుడైనా రావచ్చు. కానీ నిద్రలో వచ్చినప్పుడు అది మరింత ప్రాణాంతకం అవుతుంది. ఎందుకంటే.. మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు శరీరంలో కలిగే మార్పులను గమనించే స్పృహ తక్కువగా ఉంటుంది.

Advertisement

1. అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవడం:
నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడం లేదా గాలి కోసం తల్లడిల్లడం గుండెపోటుకు ప్రధాన సంకేతం. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు, ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోయి ఊపిరి ఆడకుండా చేస్తుంది. దీని వల్ల వ్యక్తి అకస్మాత్తుగా నిద్రలేచి కూర్చుంటారు.

2. గురక , స్లీప్ అప్నియా:
సాధారణ గురక వేరు, కానీ ‘స్లీప్ అప్నియా’ ఉన్నవారిలో నిద్రలో శ్వాస తాత్కాలికంగా ఆగిపోతుంది. ఇది గుండెపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు లేదా మీ భాగస్వామి నిద్రలో శ్వాస ఆగిపోయినట్లుగా గుర్తిస్తే.. అది గుండె జబ్బులకు సంకేతం కావచ్చు.

Advertisement

3. విపరీతమైన చెమటలు పట్టడం:
గది ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పటికీ, నిద్రలో విపరీతంగా చెమటలు పట్టడం లేదా చల్లని చెమటలు రావడం గుండె పోటు లక్షణం కావచ్చు. రక్తాన్ని పంప్ చేయడానికి గుండె కష్టపడుతున్నప్పుడు శరీరం ఈ విధంగా ప్రతిస్పందిస్తుంది.

4. ఛాతిలో అసౌకర్యం లేదా భారం:
చాలా మంది నిద్రలో వచ్చే ఛాతీ నొప్పిని ‘గ్యాస్ సమస్య’ అని పొరపడతారు. ఛాతీపై ఎవరో కూర్చున్నట్లుగా భారంగా అనిపించడం, ఒత్తిడి లేదా మంట రావడం గుండెపోటుకు నిదర్శనం. ఈ నొప్పి కేవలం ఛాతికే పరిమితం కాకుండా ఎడమ చేయి, మెడ, దవడ లేదా వెనక భాగానికి పాకవచ్చు.

5. అకస్మాత్తుగా మెలకువ రావడం,కంగారు:
ఎలాంటి కారణం లేకుండా గుండె వేగంగా కొట్టుకోవడం లేదా తీవ్రమైన భయం, ఆందోళనతో నిద్రలో నుంచి మేల్కొంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు.

6. వికారం, కడుపు నొప్పి:
కొందరిలో గుండె పోటు లక్షణాలు అజీర్ణంలా కనిపిస్తాయి. నిద్రలో వికారం కలగడం, వాంతులు రావడం లేదా కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి రావడం గుండెపోటు సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read: జంక్ ఫుడ్ తింటున్నారా? మీ మెదడుకు ‘స్లో పాయిజన్’ ఇస్తున్నట్లే!

జాగ్రత్తలు, నివారణ:
రెగ్యులర్ చెకప్స్: బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి.

ఆహారం: పడుకునే ముందు ఎక్కువ మోతాదులో ఆహారం, అధిక నూనె ఉన్న పదార్థాలు తీసుకోకండి.

వ్యాయామం: రోజువారీ శారీరక శ్రమ గుండె కండరాలను బలోపేతం చేస్తుంది.

Related News

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

Big Stories

Advertisement
×