E-Paper
Advertisement

Peddi Controversy: పెద్ది స్టోరీ ట్విస్ట్..ఇది ఒరిజినల్ కాదా ?

Peddi Controversy: పెద్ది స్టోరీ ట్విస్ట్..ఇది ఒరిజినల్ కాదా ?
Advertisement

Peddi Controversy: రామ్ చరణ్ పుట్టినరోజు గిఫ్ట్ గా రిలీజ్ అయిన ‘పెద్ది పెహల్వాన్’ గ్లింప్స్ ఒకవైపు రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే. అయితే ఇపుడు అదే గ్లింప్స్‌ను ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. అసలు ఇది ఒరిజినల్ కథ కాదని , పక్కా కాపీ అంటూ వస్తున్న కామెంట్లతో అటు మెగా ఫ్యాన్స్ వర్సెస్ ట్రోలర్స్ అన్నట్టుగా సోషల్ మీడియా సాక్షిగా ఫ్యాన్ వార్ నడుస్తుంది.

సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, కిచ్చా సుదీప్ ‘పహిల్వాన్’ సినిమాల కాపీ

Advertisement

తాజాగా వదిలిన 44 సెకన్ల ఈ గ్లింప్స్‌లో చరణ్‌ను కుస్తీ యోధుడిగా చూపించగా ఈ విజువల్స్ అచ్చం సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, కిచ్చా సుదీప్ ‘పహిల్వాన్’ సినిమాలను కాపీ కొట్టినట్టు ఉన్నాయని ఆరోపిస్తున్నారు నెటిజన్లు “అదే మట్టి, అదే ఎలివేషన్, అదే బాడీ లాంగ్వేజ్.. .. ఉప్పెనలో కొత్తదనం చూపించిన బుచ్చిబాబు ఇక్కడ మాత్రం పాత సినిమాలను మిక్సీలో వేసి రుబ్బేసాడు అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు ముఖ్యంగా గదతో చేసే విన్యాసాలు కూడా గతంలో చాలా సినిమాల్లో చూసేసినవే అంటూ ఏకిపారేస్తున్నారు.

also read:Dhurandhar 2 controversy: ‘ధురంధర్ 2’ రికార్డులపై ఒవైసీ హైదరాబాదీ పంచ్!

Advertisement

నోళ్లు మూయిస్తున్న మెగా ఫ్యాన్స్

అయితే ఇలా పెద్ది పై కాపీ క్యాట్ ఆరోపణలు రావడంతో మెగా ఫ్యాన్స్ ఎక్కడా తగ్గడం లేదు. ముఖ్యంగా ”కుస్తీ అంటే ఇసుకలోనే ఆడతారు కానీ, ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు ఆడరు కదా!” అంటూ ట్రోలర్ల నోళ్లు మూయిస్తున్నారు.ఇక ఒక కుస్తీ ప్లేయర్ కథ అన్నప్పుడు ఆ మాత్రం పోలికలు రావడం సహజమని,ఇలా కేవలం ఒక చిన్న టీజర్ చూసి సినిమా మొత్తాన్ని జడ్జ్ చేయడం తెలివి తక్కువ పని అని,చరణ్ పడ్డ కష్టం, ఆయన లుక్ చూసి ఓర్వలేకనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు మెగా ప్యాన్స్.

క్రికెట్ బ్యాట్ to పెహల్వాన్ అవతార్‌..

మరో వైపు ‘పెద్ది’ సినిమా చుట్టూ ఒక పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తోంది. సినిమా నుండి అప్ డేట్స్ వదిలిన తొలి రోజుల్లో చరణ్ క్రికెట్ బ్యాట్ పట్టుకున్న పోస్టర్లు దర్శనమిచ్చాయ్ .ఇప్పుడేమో పెహల్వాన్ అవతార్‌లో సందడి చేస్తున్నాడు.ఇక “కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదు.. ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట” అనే డైలాగ్ చూస్తుంటే, ఇది మల్టీ-స్పోర్ట్స్ డ్రామా అని క్లియర్ క్లారిటీ వచ్చేసింది. అయితే,ఇలా అన్నిఆటలని ఒకే సినిమాలో చూపిస్తే కథ కిచిడీ అయ్యే ప్రమాదం ఉందని కాస్త గట్టిగానే హెచ్చరిస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

ఏప్రిల్ 30న వచ్చేనా ?

ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే ఈ సినిమాని ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు కాని ఇంకా రిలీజ్ అవుతుందా లేదా అన్న డైలమాలోనే ఉన్నారు మూవీ లవర్స్. మొత్తానికి చరణ్ కండలు తిరిగిన బాడీ, పక్కా లోకల్ డైలాగ్ డెలివరీ సినిమాకి ప్లస్ పాయింట్లు అయితే.. కాపీ క్యాట్ అన్న ముద్ర మైనస్ అవుతోంది. మరి చరణ్ ఈ ‘పెద్ది’తో థియేటర్లలో ఏ రేంజ్ కుస్తీ పడతారో, బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను మట్టి కరిపిస్తారో కాలమే డిసైడ్ చేయాలి.

also read:Ilaiyaraaja Live Hyderabad: హైదరాబాద్‌లో ‘మ్యాస్ట్రో’ మేనియా: గచ్చిబౌలిని ఊపేయనున్న ఇళయరాజా లైవ్ కాన్సర్ట్!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×