E-Paper
Advertisement

మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్.. ఈ మినహాయింపులు మర్చిపోకండి!

మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్.. ఈ మినహాయింపులు మర్చిపోకండి!
Advertisement

Motor Insurance Exemptions: మోటారు బైక్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి రోజువారీ లైఫ్ లో భాగమయ్యాయి. ఇంట్లో ప్రతి ఒక్కరికీ ద్విచక్ర వాహనం ఉంటుంది. మోటార్ వెహికల్స్ కు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. మోటార్ ఇన్సూరెన్స్ లో వెహికల్ నడిపే వ్యక్తికి, వెహికల్ కు , థర్డ్‌ పార్టీ కవర్ అవుతారు. ఈ మూడు కవర్ అవ్వలవ్వాలంటే ఫుల్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నంత మాత్రాన ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతీ నష్టాన్ని కవర్ చేయదు. కొన్ని నష్టాలకు బీమా కవరేజ్‌ వర్తించదు.

తాగి నడిపితే

డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టవిరుద్ధం. డ్రింక్ చేసి వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలకు ఇన్సూరెన్స్ వర్తించదు. తాగి వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, ఇన్సూరెన్స్ కంపెనీకి బీమా క్లెయిమ్ రిజెక్ట్ చేసే హక్కు ఉంది.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోతే

Advertisement

లైసెన్స్ లేకుండా లేదా లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత.. వాహనం నడిపినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సంస్థ నష్టాన్ని కవర్ చేయదు. అందుచేత, మోటారు వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

సర్వీసింగ్‌ చేయించకపోతే

ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంజిన్‌ లోపాలు లేదా నిర్వహణ నష్టాలను కవర్ చేయవు. మోటార్ వెహికల్ ను రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయించకపోవడం వల్ల ఇంజిన్ ఫెయిల్ లేదా అరిగిపోయిన బ్రేక్ ప్యాడ్‌లతో డ్రైవ్ చేసినా, ఇలాంటి రిఫైర్లకు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. అందుకే మోటార్ వెహికల్స్ కు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం కూడా ముఖ్యమే. సాధారణ తరుగుదల కారణంగా ఏదైనా నష్టం జరిగితే కవరేజ్‌ వర్తించదు.

ఈ మినహాయింపులు

Advertisement

వాహనదారుడు ఏదైనా చట్టవిరుద్ధమైన పనిలో పాల్గొన్నా లేదా రోడ్‌పై రేసింగ్‌లో పాల్గొన్నా సమయంలో జరిగే నష్టాలపై బీమా కవరేజ్‌ వర్తించదు. వరదలు, భూకంపాలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్‌ లో ఉండకపోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రాంతాల్లో ఉంటే.. ఇలాంటి ప్రమాదాలు కవర్ అయ్యేలా యాడ్-ఆన్ తీసుకోవడం బెటర్. యుద్ధం, ఉగ్రవాదం లేదా అల్లర్లు వల్ల కలిగే నష్టాలకు బీమా కవరేజీ వర్తించదు.

లాక్ చేయడం మర్చిపోవడంతో వాహనం చోరీకి గురైతే, నిర్లక్ష్యం కారణంగా ఏదైనా నష్టం జరిగితే బీమా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ప్రమాదం జరిగితే నిర్దిష్ట సమయంలో బీమా సంస్థకు సమాచారం అందించాలి. సరైన సమయంలో ప్రమాదాన్ని బీమా సంస్థకు తెలియజేయకపోతే క్లెయిమ్ ను రిజెక్ట్ చేయవచ్చు. కాబట్టి, ప్రమాదం తర్వాత వీలైనంత త్వరగా బీమా ప్రొవైడర్‌కు సమాచారం అందించాలి.

మీ బైక్‌/కారును కమర్షియల్ గా ఉపయోగిస్తే బీమా కవరేజీని మినహాయిస్తాయి కంపెనీలు. సరకు రవాణా లేదా ప్రయాణికుల రవాణాకు ఉపయోగిస్తే కచ్చితంగా కమర్షియల్ వెహికల్ బీమా తీసుకోవాలి. సాధారణ బీమా తీసుకున్న వాహనాలను కమర్షియల్ గా ఉపయోగిస్తే బీమా నష్టాలను కవర్ చేయకపోవచ్చు. ఏదైనా ప్రమాదం వల్ల నష్టం జరిగితే తప్ప, టైర్లు, ట్యూబ్‌లకు నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. వైర్లు, బ్యాటరీలు, ఇంజిన్ షార్ట్ సర్క్యూట్, ఆయిల్ లీకేజ్, ఎలుకల కారణంగా జరిగిన నష్టాలు బీమా పాలసీ పరిధిలోకి రావు.

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు చెక్ చేయండి

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×