E-Paper
Advertisement

High Bp Control Tips:హైబీపీ సమస్యా ? ఇలా చేస్తే క్షణాల్లోనే కంట్రోల్ అవడం గ్యారంటీ !

High Bp Control Tips:హైబీపీ సమస్యా ? ఇలా చేస్తే క్షణాల్లోనే కంట్రోల్ అవడం గ్యారంటీ !
Advertisement

High Bp Control Tips: హైబీపీ సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తుంటారు. బిజీ లైఫ్ స్టైల్ , ఒత్తిడితో పాటు సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇదెలా ఉంటే రక్తపోటుతో గుండెతో పాటు కీడ్నీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.బీపీ పెరిగినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వంటింట్లో దొరికే కొన్ని రకాల సహజ సిద్దమైన పదార్థాలతో దీనిని ప్రాథమిక దశలో అదుపు గుర్తించవచ్చు.
మందులతో పాటు లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుంటే.. బీపీని కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అసలు ఆ చిట్కాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

హై బీపీ తగ్గించే ఇంటి చిట్కాలు:

Advertisement

1. వెల్లుల్లి: వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ‘అల్లిసిన్’ అనే పదార్థం రక్త నాళాలను సడలించి, రక్తం సాఫీగా ప్రవహించేలా చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒకట్రెండు వెల్లుల్లి రెబ్బలను నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. నిమ్మరసం:
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల స్థితిస్థాపకతను మెరుగు పరుస్తాయి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయ పడుతుంది. గ్లాసు గోరు వెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం కలుపుకుని ఉదయాన్నే తాగాలి. ఇలా తరచుగా తాగడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

Advertisement

3. మెంతులు:
మెంతులలో ఉండే ఫైబర్, పొటాషియం రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి తోడ్పడతాయి. రాత్రిపూట ఒక చెంచా మెంతులను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగి, మెంతులను నమిలి తినాలి.

4. కొబ్బరి నీళ్లు:
కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని సోడియం ప్రభావాన్ని తగ్గించి రక్తపోటును స్థిరీకరిస్తాయి.

ఆహార నియమాలు ,లైఫ్ స్టైల్ మార్పులు:

కేవలం చిట్కాలు మాత్రమే సరిపోవు. ఆహారంలో కొన్ని మార్పులు తప్పనిసరి.

ఉప్పు తగ్గించండి : హై బీపీ ఉన్నవారు ఉప్పును చాలా తక్కువగా తీసుకోవాలి. సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. ఊరగాయలు, అప్పడాలు, ప్యాక్ చేసిన ఫుడ్స్ మానేయాలి.

పొటాషియం పెంచండి: అరటిపండ్లు, ఆకుకూరలు, నారింజ వంటి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది సోడియంను బయటకు పంపడానికి సహాయ పడుతుంది.

ఒత్తిడి తగ్గించుకోండి: బీపీ పెరగడానికి మానసిక ఒత్తిడి ప్రధాన కారణం.రోజుకు కనీసం 15-20 నిమిషాలు ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుంది.

Also Read: బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు పెరుగుతారా ? తగ్గుతారా ? ఇంతకీ ఏది నిజం

శారీరక శ్రమ: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

మరికొన్ని చిట్కాలు:

1.తగినంత నిద్ర: శరీరానికి విశ్రాంతినిచ్చి బీపీని తగ్గిస్తుంది.
2.అధిక నీరు తాగడం:శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
3ధూమపానం, మద్యం మానుకోవడం: రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×