E-Paper
Advertisement

High Cholesterol: గుండె ఆరోగ్యం జాగ్రత్త.. కొలెస్ట్రాల్ పెంచే ఈ 5 బ్రేక్‌ఫాస్ట్ ఫుడ్స్ అస్సలు తినకండి

High Cholesterol: గుండె ఆరోగ్యం జాగ్రత్త.. కొలెస్ట్రాల్ పెంచే ఈ 5 బ్రేక్‌ఫాస్ట్ ఫుడ్స్ అస్సలు తినకండి
Advertisement

High Cholesterol: నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హై కొలెస్ట్రాల్. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన రోజును ప్రారంభించే బ్రేక్ ఫాస్ట్ కొలెస్ట్రాల్ స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటే.. డెంటిస్టులు, పోషకాహార నిపుణులు సూచిస్తున్న ఈ 5 రకాల బ్రేక్‌ ఫాస్ట్ ఆహారాలకు వెంటనే దూరంగా ఉండటం మంచిది.

1. ప్రాసెస్ చేసిన మాంసం:
బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది  నాన్ వెజ్ కూడా తింటుంటారు. వీటిలో శాచురేటెడ్ ఫ్యాట్స్, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి. వీటికి బదులుగా గుడ్డులోని తెల్లసొన లేదా పప్పు ధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోవడం ఉత్తమం.

Advertisement

2. మైదాతో చేసిన పదార్థాలు:
బ్రెడ్, బన్‌లు, పూరీ, పరాటాలు వంటివి మైదాతో తయారవుతాయి. మైదాలో ఫైబర్ (పీచు పదార్థం) ఉండదు. ఇది శరీరంలో చక్కెర స్థాయిలను పెంచడమే కాకుండా.. కాలేయం ఎక్కువ కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా నూనెలో వేయించిన పూరీలు గుండె ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.

3. స్వీట్ పేస్ట్రీలు, డోనట్స్:
బ్రేక్‌ఫాస్ట్‌లో కేకులు, డోనట్స్ లేదా చక్కెర అధికంగా ఉండే మఫిన్‌లు తీసుకోవడం వల్ల శరీరంలోకి భారీగా ట్రాన్స్ ఫ్యాట్స్ చేరుతాయి. ఇవి శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ ను తగ్గించి, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. చక్కెర, నెయ్యి ఎక్కువగా ఉండే స్వీట్లు రక్త నాళాల్లో అడ్డంకులకు కారణమవుతాయి.

Advertisement

4. ఫుల్ ఫ్యాట్ డైరీ ఉత్పత్తులు:
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వెన్న, చీజ్, ఫుల్ క్రీమ్ పాలతో చేసిన అల్పాహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో ఉండే కొవ్వు నేరుగా రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది. వీటికి ప్రత్యామ్నాయంగా లో-ఫ్యాట్ పెరుగు లేదా బాదం పాలను ఉపయోగించడం మంచిది.

5. రెడీ-టు-ఈట్ సిరియల్స్:
మార్కెట్లో దొరికే రంగు రంగుల సిరియల్స్ ఆరోగ్యకరమని చాలామంది భావిస్తారు. కానీ వీటిలో కృత్రిమ చక్కెరలు, రంగులు , ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. పీచు పదార్థం లేని ఇటువంటి ఆహారం వల్ల బరువు పెరగడంతో పాటు కొలెస్ట్రాల్ సమస్య జటిలమవుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఏం తినాలి ?
అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలంటే  ఈ కింది బ్రేక్ ఫాస్ట్ మార్పులు చేసుకోండి.

ఓట్స్: ఇందులో ఉండే బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను గ్రహించి శరీరం నుంచి బయటకు పంపుతుంది.

మొలకెత్తిన గింజలు: వీటిలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

తాజా పండ్లు: ఆపిల్, బొప్పాయి, సిట్రస్ పండ్లు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయ పడతాయి.

నట్స్: బాదం, వాల్‌నట్స్ వంటివి పరిమితంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది కేవలం మందుల మీదనే ఆధారపడి ఉండదు. మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామంపైనే 80% ఆధారపడి ఉంటుంది. పైన పేర్కొన్న ఆహారాలను పక్కన పెట్టి, సహజసిద్ధమైన,పీచు పదార్థం ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా మీ గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×