E-Paper
Advertisement

మీ పెదాలు నల్లగా ఉన్నాయని అందరిముందు వెళ్లడానికి సిగ్గుపడుతున్నారా? గులాబి రంగు పెదాల కోసం ఈ చిట్కాలు

మీ పెదాలు నల్లగా ఉన్నాయని అందరిముందు వెళ్లడానికి సిగ్గుపడుతున్నారా? గులాబి రంగు పెదాల కోసం ఈ చిట్కాలు
Advertisement

ముఖం అందంగా కనిపించాలంటే పెదవులు కూడా అందంగా కనిపించాలి. మృదువుగా, గులాబీ రంగులో పెదాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి పెదవులు నల్లగా మారిపోతున్నాయి. ధూమపానం, శరీరంలో నీటి లోపం, ఎండ, తప్పుడు లిప్‌స్టిక్ వేసుకోవడం వంటి కారణాల వల్ల పెదవులు నల్లబడతాయి. ఈ సమస్యకు ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో పరిష్కరించవచ్చు.

పెదవులు ఎందుకు నల్లబడతాయి

పెదవుల చర్మం శరీరంలోని మిగతా చర్మం కంటే చాలా పలుచగా ఉంటుంది. కాబట్టి ఎండ, ధూమపానం, నీటి లోపం వల్ల సులభంగా దెబ్బతింటుంది. ఎండలో ఎక్కువగా ఉండటం వల్ల మెలనిన్ పెరిగి పెదవులు నల్లబడతాయి. ధూమపానం వల్ల రక్తప్రసరణ తగ్గించి పెదవుల రంగు దెబ్బతింటుంది.

పెదవులు తడిగా ఉండాలి

Advertisement

పొడి పెదవులు.. నల్లగా, గట్టిగా కనిపిస్తాయి. రోజంతా తగినంత నీళ్లు తాగాలి. కొబ్బరి నూనె లేదా షీయా బటర్‌ను పెదవులకు పూస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇవి సహజంగా తేమను నిలుపుతాయి, పెదవులు మృదువుగా ఉంటాయి.

తేనె, నిమ్మకాయ

తేనె, నిమ్మకాయ మంచి నివారణ. తేనె.. తేమ ఇస్తుంది, నిమ్మకాయ నలుపును తగ్గిస్తుంది. కొన్ని చుక్కలు నిమ్మరసం తేనెలో కలిపి రాత్రి పూయండి. కొన్ని నిమిషాల తర్వాత వెచ్చని నీటితో కడగాలి. ఎక్కువగా నిమ్మకాయ వాడకండి, చర్మం చికాకు పడవచ్చు.

బీట్‌రూట్‌తో గులాబీ పెదవులు

Advertisement

బీట్‌రూట్ సహజ రంగును ఇస్తుంది. తాజా బీట్‌రూట్ ముక్కలు కట్ చేసి పెదవుల మీద మెల్లగా రాస్తే రంగు మెరుగవుతుంది. రసం కూడా పూయవచ్చు. నిరంతరం వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

షుగర్ స్క్రబ్‌తో చనిపోయిన చర్మం తొలగించండి

పెదవుల మీద మృత చర్మ కణాలు ఉండడంతో చర్మం నల్లగా కనిపిస్తుంది. తేనె లేదా కొబ్బరి నూనెతో షుగర్ కలిపి మెల్లగా స్క్రబ్ చేయాలి. వారానికి 1-2 సార్లు మాత్రమే చేయాలి. గట్టిగా రుద్దకండి.

అలోవెరాతో పెదవులకు ఉపశమనం

అలోవెరా జెల్ పెదవులను.. నలుపు, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. తాజా జెల్‌ను నేరుగా పూసి కొన్ని నిమిషాలు ఉంచి కడగాలి. ఎండలో దెబ్బతిన్న పెదవులకు చాలా మంచిది.

Also Read: చికెన్ ఇష్టంగా తింటున్నారా? ఈ చికెన్ భాగాలు తింటే ఆరోగ్యానికి హానికరం

ధూమపానం, కేఫీన్ తగ్గించండి

పెదవులు నల్లబడడానికి ప్రధాన కారణం సిగరెట్‌లు. అధికంగా టీ, కాఫీ తాగడం కూడా సమస్యను పెంచుతుంది. ఈ అలవాట్లు తగ్గిస్తే పెదవులు మెరుగవుతాయి.

ఎండ నుంచి పెదవులను రక్షించండి

పెదవులు ఎండకు సులభంగా దెబ్బతింటాయి. SPF ఉన్న లిప్ బామ్ రోజూ వాడాలి.

మంచి అలవాట్లు పాటించండి

పండ్లు, కూరగాయలు తినడం, మంచి నిద్ర, తగినంత నీళ్లు తాగడం వల్ల పెదవులు సహజంగా అందంగా ఉంటాయి.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×