E-Paper
Advertisement

మూడు క్యాచ్ లు వ‌దిలేసిన పంజాబ్… కావ్య పాప డ‌బ్బుల‌కు అమ్ముడుపోయారంటూ ట్రోల్స్

మూడు క్యాచ్ లు వ‌దిలేసిన పంజాబ్… కావ్య పాప డ‌బ్బుల‌కు అమ్ముడుపోయారంటూ ట్రోల్స్
Advertisement

SRH VS PBKS:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Delhi Capitals vs Chennai Super Kings) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్ పెట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్… 235 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్, కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరు భయంకరమైన బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో ఈ స్కోరు సాధించింది.

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

పంజాబ్ కింగ్స్ చెత్త ఫీల్డింగ్.. మూడు క్యాచ్ లు వదిలేసిన ప్లేయర్లు

Advertisement

పంజాబ్ టీమ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా పంజాబ్ ప్లేయర్లు చెత్త ఫీల్డింగ్ చేసి… హైదరాబాద్ కు భారీ స్కోర్ సమర్పించుకున్నారు. సింపుల్ గా వచ్చిన మూడు క్యాచ్ లు వదిలేసి.. పంజాబ్ కొంప ముంచారు. 9, 18 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఇచ్చిన రెండు క్యాచ్ లను కన్నోలి, ఫెర్గ్యూసన్ వదిలేయడం జరిగింది. అటు డేంజర్ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్ క్యాచ్ ను శశాంక్ సింగ్ విడిచిపెట్టి కొంప ముంచాడు. అటు ఇషాన్ కిషన్ స్టంపింగ్ ను కూడా కీపర్ ప్ర‌భ్ సిమ్రాన్‌ సింగ్ మిస్ చేశాడు. ఈ నాలుగు లైఫ్ లు వచ్చిన నేపథ్యంలో.. క్లాసెన్ తో పాటు ఇషాన్ కిష‌న్ ఇద్దరు చెల‌రేగారు. హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) 69 ప‌రుగులు సాధించింది. ఇషాన్ కిష‌న్ ( Ishan Kishan) 55 ప‌రుగులు చేసి రెచ్చిపోయాడు.

కావ్య పాప డ‌బ్బుల‌కు అమ్ముడుపోయారంటూ ట్రోల్స్

హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా సంచలన ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. పంజాబ్ ఆటగాళ్లు మూడు క్యాచ్ లు.. ఒక స్టంప్ వదిలేసిన నేపథ్యంలో ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. కావ్య పాప ఇచ్చిన డబ్బులకు పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు అమ్ముడుపోయారని సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారు. మొన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ గెలిచిందని… ఇప్పుడు అధికారం తీర్చుకునేందుకు ఫిక్సింగ్ చేశారని అంటున్నారు. ఇందులో భాగంగానే పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు… కావాలనే బంగారం లాంటి క్యాచ్ లను వదిలేసారని ఫైర్ అవుతున్నారు క్రికెట్ అభిమానులు. కాగా నిర్ణయిత 20 ఓవర్లలో హైదరాబాద్ 235 పరుగులు సాధించగా… చేజింగ్ లో పంజాబ్ కింగ్స్ తడబడుతోంది. నాలుగు ఓవర్లు ఆడిన పంజాబ్ కింగ్స్, 30 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. కీలకమైన బ్యాటర్లందరూ వికెట్లు సమర్పించుకున్నారు.

Advertisement

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed

 

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×