E-Paper
Advertisement

Wine Shops: రాయపర్తి వైన్స్‌లో జోరుగా అదనపు వసూళ్ల దందా.. పట్టించుకోని అధికారులు

Wine Shops: రాయపర్తి వైన్స్‌లో జోరుగా అదనపు వసూళ్ల దందా.. పట్టించుకోని అధికారులు
Advertisement

Wine Shops: స్వేచ్ఛ బ్యూరో: రాయపర్తి మండల కేంద్రంలోని వైన్స్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై వరుసగా వార్తలు ప్రచురితమవుతున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైన్స్ షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోందనే ఆరోపణలు పలుమార్లు వెలుగులోకి వచ్చినా, సంబంధిత అధికారులు మౌనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బాటిల్‌పై రూ.20 నుంచి 30..

స్థానికుల కథనం ప్రకారం రాయపర్తి వైన్స్ షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక క్వార్టర్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు, ఫుల్ బాటిల్‌పై రూ.60 నుంచి రూ.90 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు. రోజూ వందలాది మంది వినియోగదారుల నుంచి ఈ విధంగా అదనపు మొత్తాలు వసూలు చేయడం వల్ల భారీగా అక్రమ లాభాలు పొందుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

పట్టించుకోని ఎక్సైజ్ శాఖ..

Advertisement

ఇదిలా ఉండగా, రాయపర్తి పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బెల్ట్ షాపులకు కూడా ఇదే వైన్స్ షాపుల నుంచి మద్యం సరఫరా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బహిరంగంగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి దాడులు, తనిఖీలు నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రజలు చర్చించు కుంటున్నారు. మరోవైపు, బెల్ట్ షాపుల నిర్వాహకులు నిర్భయంగా వ్యాపారం కొనసాగిస్తుండగా, వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also read: Puri Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఓకేసారి 120 మంది భక్తులు..!

అధికారులపై అనుమానాలు

Advertisement

వరుసగా వార్తలు వెలువడుతున్నప్పటికీ వర్ధన్నపేట ఎక్సైజ్ శాఖ అధికారులు రాయపర్తి వైన్స్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించకపోవడం, అక్రమాలపై స్పందించకపోవడం వల్ల స్థానికుల్లో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రాయపర్తి వైన్స్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరిగాయా..? బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా చేశారా..? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణెమ్మ..

ఈ ఆరోపణలపై స్పందించిన వరంగల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణెమ్మ రాయపర్తిలోని వైన్స్ షాపులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని తెలిపారు. సంబంధిత అధికారులతో తనిఖీలు నిర్వహించి విచారణ చేపడతామని చెప్పారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించినా, బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా చేసినా అవి రుజువైతే సంబంధిత వైన్స్ షాపు నిర్వాహకులపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మణెమ్మ అన్నారు.

Also read: Supreme Court: ఆ ఒక్క కారణంతో స్కూళ్లను అడ్డుకోవద్దు.. తమిళనాడుకు సుప్రీం వార్నింగ్!

Related News

Telangana Sports: టీజీ-20 క్రికెట్ లీగ్ గెలిచిన జట్టుతో.. సీఎం రేవంత్ భేటీ..!

Jangaon News: బచ్చన్న పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం.. పట్టించుకోని యంత్రాంగం!

Food Poisoning: సిరిసిల్లలో దారుణం.. బకాసుర మండి బిర్యాని తిని 10 మందికి అస్వస్థత!

కాంగ్రెస్ స్కామ్‌ల సర్కార్.. సర్వేల్లోనే తేలిపోయింది.. కేటీఆర్ ధ్వజం

Supreme Court: ఆ ఒక్క కారణంతో స్కూళ్లను అడ్డుకోవద్దు.. తమిళనాడుకు సుప్రీం వార్నింగ్!

Kalvakuntla Kavitha: డ్రామాలొద్దు.. కాంగ్రెస్ సర్కార్ పై కల్వకుంట్ల కవిత ఫైర్!

School Controversy: హిందూ విద్యార్థికి ఖురాన్‌ హోంవర్క్ కలకలం.. స్కూల్ వద్ద భారీ ఉద్రికత్త!

Big Stories

Advertisement
×