E-Paper
Advertisement

చీపురను ఉప్పు నీటిలో నానబెడితే.. ఆ సమస్యలన్నీ మాయం, నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ ట్రిక్!

చీపురను ఉప్పు నీటిలో నానబెడితే.. ఆ సమస్యలన్నీ మాయం, నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ ట్రిక్!
Advertisement

Home Cleaning Hacks: ఇల్లు ఊడ్చే చీపుర (broom) ఎక్కువ రోజులు మన్నికగా రావాలన్నా, ఒకవేళ మీరు వాడేది ప్లాస్టిక్ చీపుర అయితే.. దాని బ్రషెస్ పాడవకుండా ఉండాలన్నా ఒక అద్భుతమైన చిట్కాను ట్రై చేయవచ్చు. అదేమిటంటే.. వేడి నీళ్లలో కాస్త ఉప్పు వేసి చీపురను రాత్రంతా నానబెట్టడం. ఇంట్లో ఉండే వస్తువులతోనే రూపాయి ఖర్చు లేకుండా మన వస్తువులను ఎలా కాపాడుకోవచ్చో ఈ చిట్కా నిరూపిస్తోంది.

ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది?

సహజంగానే ఉప్పుకు నారను లేదా బ్రషెస్ యొక్క ఫైబర్‌ను గట్టిపరిచే గుణం ఉంటుంది. దీనికి వేడి నీరు, వెనిగర్ తోడైనప్పుడు ఆ మిశ్రమం చీపుర బ్రషెస్‌పై అద్భుతంగా పనిచేస్తుంది. రోజువారీ వాడకం వల్ల చీపుర పోగులు పక్కకు పోవడం, వంగిపోవడం లాంటివి జరుగుతుంటాయి. కానీ ఈ చిట్కా ద్వారా బ్రషెస్ మళ్లీ తమ పూర్వ రూపాన్ని సంతరించుకుని, గట్టిగా తయారవుతాయి.

కావాల్సిన వస్తువులు:

Advertisement

ఈ పద్ధతిని ప్రయత్నించడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక బకెట్ నిండా వేడి నీరు, ఒక కప్పు వైట్ వెనిగర్, అర కప్పు ఉప్పు ఉంటే సరిపోతుంది. వీటితో పాటు మీరు శుభ్రం చేయాలనుకుంటున్న చీపురను రెడీగా పెట్టుకోవాలి.

Also Read: వర్షాకాలంలో కిడ్నీ సమస్యలకు కారణమయ్యే ఆ తప్పు మీరూ చేస్తున్నారా?

ఎలా ఉపయోగించాలి?

Advertisement

ముందుగా బకెట్‌లో చీపుర పోగులు మునిగేంత వరకు వేడి నీటిని తీసుకోవాలి. అందులో వెనిగర్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చీపురను ఆ నీళ్లలో కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి. అయితే దీనిని రాత్రంతా అలాగే వదిలేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. చీపురపై పేరుకుపోయిన మొండి మురికి కూడా సులువుగా వదిలిపోతుంది.

అద్భుతమైన ఫలితం:

మరుసటి రోజు ఉదయం చీపురను నీటిలోంచి తీసి, కాస్త గట్టిగా పండాలి. ఆ తర్వాత బాత్రూమ్ లేదా సింక్ దగ్గర బ్రషెస్ పైకి ఉండేలా తిరగేసి ఆరబెట్టాలి. దీనివల్ల చీపురలోని అదనపు నీరంతా కారిపోతుంది. ఇది ఆరిన తర్వాత చూస్తే చీపుర సరికొత్తగా, గట్టిగా మారుతుంది. దీంతో అది ఎక్కువ కాలం మన్నుతుంది.

Also Read: కీటకాలు, నెగటివ్ ఎనర్జీ మాయం.. ఇంటి మెయిన్ డోర్ వద్ద ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

Related News

నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?

గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్!

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!

నోటికి కారంగా, సూపర్ టేస్టీగా ఆలూ పచ్చి కారం ఫ్రై!

నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

Big Stories

Advertisement
×