Jangaon News: స్వేచ్చ బ్యూరో: మండలంలోని వివిధ గ్రామాల్లో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని, కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. దీంతో కల్తీ మద్యం సులభంగా దొరుకుతోంది. నాణ్యత లేని మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. మద్యం వ్యసనంతో కుటుంబాల్లో కలహాలు, మహిళలు-చిన్నారులు ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. రోజువారీ కూలీలు, పేదలు సంపాదనలో పెద్ద భాగం మద్యానికే ఖర్చు చేస్తున్నారు.
Also read: Kalvakuntla Kavitha: డ్రామాలొద్దు.. కాంగ్రెస్ సర్కార్ పై కల్వకుంట్ల కవిత ఫైర్!
దీని వల్ల జీవనోపాధి దెబ్బతింటోంది. కల్తీ మద్యం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. అన్ని అక్రమ బెల్ట్ షాపులను గుర్తించి వెంటనే మూసివేయాలి. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో నిరంతర తనిఖీలు చేసి అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దూడల కనకయ్య, ముసిని రాజు గౌడ్, మహమ్మద్ షబ్బీర్, తదితరులు పాల్గోన్నారు.
Also read: Supreme Court: ఆ ఒక్క కారణంతో స్కూళ్లను అడ్డుకోవద్దు.. తమిళనాడుకు సుప్రీం వార్నింగ్!