Pushups: ఫుష్ అప్స్ అనేవి కేవలం ఛాతీ కండరాల కోసం చేసే వ్యాయామం మాత్రమే కాదు. ఇవి శరీర ఎగువ భాగం యొక్క మొత్తం శక్తిని, ఓర్పును సూచిస్తాయి. ఒక వ్యక్తి ఎన్ని ఫుష్ అప్స్ చేయగలరు అనేది వారి వయస్సు, లింగం, ప్రస్తుత శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం.. ఒక సాధారణ ఆరోగ్యవంతుడు కనీసం కొన్ని ప్రాథమిక సంఖ్యలో ఫుష్ అప్స్ చేయగలగాలి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని, కండరాల పనితీరును అంచనా వేయడానికి ఒక కొలమానంలా పనిచేస్తుంది. ఫుష్ అప్స్ చేసే సామర్థ్యం వయస్సు పెరిగే కొద్దీ మారుతూ ఉంటుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, వివిధ ఆరోగ్య సంస్థల ప్రకారం.. వివిధ వయస్సుల వారు సగటున ఎన్ని ఫుష్ అప్స్ చేయాలో ఈ కింది విధంగా విభజించవచ్చు.
1. పురుషుల కోసం సగటు :
20-29 ఏళ్లు: ఈ వయస్సులో ఉన్న పురుషులు కనీసం 22 నుంచి 28 పుషప్స్ ఒకేసారి (ఆగకుండా) చేయగలగాలి. 30 కంటే ఎక్కువ చేస్తే మీరు ‘ఎక్సలెంట్’ ఫిట్‌నెస్ కేటగిరీలో ఉన్నట్లు అర్థం.
30-39 ఏళ్లు: ఈ వయస్సులో 17 నుంచి 21 పుషప్స్ చేయగలిగితే మంచి ఫిట్‌నెస్‌గా పరిగణించవచ్చు.
40-49 ఏళ్లు: వయస్సు పెరుగుతున్న కొద్దీ కండరాల సాంద్రత తగ్గుతుంది. కాబట్టి 11 నుంచి 16 ఫుష్ అప్స్ చేయడం ఒక మంచి లక్ష్యం.
50-59 ఏళ్లు: కనీసం 9 నుంచి 12 ఫుష్ అప్స్ చేయగలగాలి.
2. మహిళల కోసం సగటు :
మహిళల్లో సహజంగానే ఎగువ శరీర బలం పురుషుల కంటే తక్కువగా ఉంటుంది.
20-29 ఏళ్లు: కనీసం 12 నుంచి 20 ఫుష్ అప్స్ చేయగలగాలి.
30-39 ఏళ్లు: 10 నుంచి 15 ఫుష్ అప్స్ చేయగలగాలి.
40-49 ఏళ్లు: 8 నుంచి 12 ఫుష్ అప్స్ చేయగలగాలి.
50-59 ఏళ్లు: 7 నుంచి 10 ఫుష్ అప్స్ చేయగలగాలి.
3. ఫుష్ అప్స్ ఎందుకు ముఖ్యం ?
రోజూ ఫుష్ అప్స్ చేయడం వల్ల కేవలం బాడీ బిల్డింగ్ మాత్రమే కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
గుండె ఆరోగ్యం: ఒక పరిశోధన ప్రకారం.. ఒకేసారి 40 కంటే ఎక్కువ ఫుష్ అప్స్ చేయగలిగే వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం 96% తక్కువగా ఉంటుంది.
కోర్ స్ట్రెంత్: ఇది పొట్ట కండరాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా వెన్నునొప్పిని తగ్గిస్తుంది.
బోన్ హెల్త్: ఇది ఎముకల సాంద్రతను పెంచి.. వయస్సు రీత్యా వచ్చే ఎముకల బలహీనతను నిరోధిస్తుంది.
Also Read: డార్క్ చాక్లెట్‌తో గుండె సమస్యలకు చెక్.. ఇందులో నిజమెంత ?
4. మీరు సరిగ్గా పుష్ అప్స్ చేస్తున్నారా ?
సంఖ్య కంటే నాణ్యత ముఖ్యం. తప్పుడు పద్ధతిలో 50 ఫుష్ అప్స్ చేయడం కంటే.. సరైన పద్ధతిలో 10 ఫుష్ అప్స్ చేయడం మేలు.
మీ వీపు నేరుగా ఉండాలి (వంగకూడదు).
చేతులు భుజాల వెడల్పులో ఉండాలి.
కిందికి వెళ్ళినప్పుడు ఛాతీ నేలకు దగ్గరగా వెళ్ళాలి.
సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి ?
మీరు ప్రస్తుతం 5 ఫుష్ అప్స్ కూడా చేయలేకపోతే నిరాశ చెందకండి. మొదట మోకాళ్లపై బరువు వేసి చేసే “నీ పుషప్స్” తో ప్రారంభించండి. క్రమంగా ప్రతి వారం 2-3 ఫుష్ అప్స్ పెంచుకుంటూ వెళ్ళండి.