E-Paper
Advertisement

Dark Chocolate For Heart: డార్క్ చాక్లెట్‌తో గుండె సమస్యలకు చెక్.. ఇందులో నిజమెంత ?

Dark Chocolate For Heart: డార్క్ చాక్లెట్‌తో గుండె సమస్యలకు చెక్.. ఇందులో నిజమెంత ?
Advertisement

Dark Chocolate For Heart: చాక్లెట్ అంటే కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు.. అందులో ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆధునిక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సాధారణ మిల్క్ చాక్లెట్లతో పోలిస్తే.. ఇందులో కోకో శాతం ఎక్కువగా ఉండటం వల్ల శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. రక్తపోటును తగ్గించడం నుంచి రక్త ప్రసరణను మెరుగుపరచడం వరకు ఇది గుండెకు రక్షణ కవచంలా పని చేస్తుంది. అయితే దీనిని ఎంత పరిమాణంలో తీసుకోవాలనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా ?

Advertisement

చాలామంది చాక్లెట్ తింటే బరువు పెరుగుతామని లేదా పళ్లు పాడవుతాయని భావిస్తారు. కానీ.. ‘డార్క్ చాక్లెట్’ విషయంలో ఇది భిన్నం. ఇందులో కనీసం 70% కంటే ఎక్కువ కోకో ఉంటే.. అది మీ గుండెకు ఒక వరప్రసాదంలా మారుతుంది. అదెలాగో ఇప్పడు తెలుసుకుందాం.

1. ఫ్లేవనాయిడ్ల శక్తి:

Advertisement

డార్క్ చాక్లెట్‌లో ‘ఫ్లేవనాయిడ్లు’ అనే మొక్కల ఆధారిత సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె కండరాలకు రక్షణనిస్తాయి. అంతే కాకుండా ఇవి రక్తనాళాల్లో ‘నైట్రిక్ ఆక్సైడ్’ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా రక్తనాళాలు వ్యాకోచించి, రక్తం సాఫీగా ప్రవహించేలా చేస్తాయి. ఇది రక్తపోటు తగ్గడానికి ఎంతగానో దోహద పడుతుంది.

2. చెడు కొలెస్ట్రాల్‌కు చెక్:

డార్క్ చాక్లెట్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణం చెందకుండా నిరోధించవచ్చు. అదే సమయంలో ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. గుండె ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా చూడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

3. మెరుగైన రక్త ప్రసరణ:

ధమనులు గట్టిపడకుండా ఉండటానికి డార్క్ చాక్లెట్ సహాయపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

4. వాపును తగ్గిస్తుంది:

శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే వాపు గుండె జబ్బులకు ప్రధాన కారణం. డార్క్ చాక్లెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించి, గుండె కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Also Read: చలికాలంలో చేతుల వణుకు.. ఇది కేవలం చలి వల్లేనా ? లేక అనారోగ్యమా ?

ఎంత తినాలి ?

డార్క్ చాక్లెట్ మంచిది కదా అని అతిగా తినకూడదు. ఎందుకంటే ఇందులో కూడా కేలరీలు, స్వల్పంగా చక్కెర ఉంటుంది.

రోజుకు 30-60 గ్రాముల పరిమాణం సరిపోతుంది.

కొనే ముందు లేబుల్ చెక్ చేసి.. కనీసం 70% నుంచి 85% కోకో ఉన్న చాక్లెట్ మాత్రమే ఎంచుకోండి.

ఎక్కువ చక్కెర , మిల్క్ సాలిడ్స్ ఉన్న చాక్లెట్ల వల్ల ప్రయోజనం ఉండదు.

Related News

మీ దాంపత్య జీవితంలో గొడవలు ఎప్పుడూ ఉండవు.. ప్రేమ మరింత పెరుగుతుంది.. ఈ టిప్స్ పాటిస్తే

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

Big Stories

Advertisement
×