E-Paper
Advertisement

Cucumber: చేదులేని కీరా దోసకాయను ఇలా ఎంపిక చేసుకోండి

Cucumber: చేదులేని కీరా దోసకాయను ఇలా ఎంపిక చేసుకోండి
Advertisement

వేసవి కాలం వచ్చిందంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కీరా దోసకాయనే. తింటే చాలు.. చల్లగా, హాయిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. తినడానికి కూడా తేలికగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు తింటే చేదుగా ఉంటుంది. తినాలనిపించక పడేస్తాము. డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. కానీ చిన్న చిన్న టిప్స్ తో చేదులేని కీరో దోసకాయను గుర్తించి కొనుక్కోవచ్చు.

రంగు చూడండి
ముందుగా కీరా రంగు గమనించండి. మంచి కీరా అంటే కాస్త డార్క్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఫ్రెష్‌గా, కాంతిగా కనిపిస్తుంది. కానీ పూర్తిగా పసుపు రంగులోకి మారిపోయిన కీరా కనిపిస్తే వెంటనే వదిలేయండి. అవి ఎక్కువగా పండిపోయి ఉంటాయి. అలాంటివి చాలాసార్లు చేదుగా ఉంటాయి.

Advertisement

పెద్దవి వద్దు
చాలా పెద్ద కీరా దోసకాయను చూస్తే చాలు వెంటనే తీసేసుకుంటారు. నిజానికి పెద్ద కీరాల్లో గింజలు ఎక్కువగా ఉంటాయి. రుచి కూడా తగ్గిపోతుంది. అలాగే చాలా చిన్నవి కూడా అంత రుచిగా ఉండవు. మధ్యస్థ సైజ్ కీరాలు అయితే బాగా తినడానికి బాగుంటాయి. కాబట్టి సైజ్ చూసి తీసుకోవడం మంచిది.

కీరా దోసకాయలను కొనేముందు చేతితో ఒకసారి నొక్కి చూడండి. ఇది చాలా ఈజీ టెస్ట్. మంచి కీరా అంటే గట్టిగా ఉంటుంది. మీరు నొక్కితే మృదువుగా, సాఫ్ట్‌గా అనిపిస్తే అది ఫ్రెష్ కాదు. లోపల పాడై ఉండొచ్చు లేదా చేదుగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాస్త గట్టిగా ఉన్నదే తీసుకోండి.

Advertisement

Also read: Electric Kettle: మీ దగ్గర ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే చాలు.. ఈ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ లు చేసుకోవచ్చు

కీరా దోసకాయ ఆకారం కూడా అది ఎలాంటి టేస్ట్ ఉంటుందో చెప్పేస్తుంది. వంకరగా, అడ్డంగా, అసమానంగా ఉన్న కీరాలు కొన్నిసార్లు సరిగ్గా పెరగవు. అలా పెరిగిన కీరాలు చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. సూటిగా, స్మూత్‌గా ఉన్న కీరాలు ఎక్కువగా టేస్ట్‌గా ఉంటాయి. చాలా బరువుగా అనిపించే కీరాలు కొన్నిసార్లు గింజలతో నిండిపోయి ఉంటాయి. వాటిలో రుచి తక్కువగా ఉండొచ్చు. తేలికగా, ఫ్రెష్‌గా అనిపించే కీరాలు తీసుకుంటే బాగుంటుంది.

ఇంతకీ కీరా ఎందుకు చేదుగా మారుతుంది? దీనికి కారణం కుకుర్బిటాసిన్ అనే సహజ పదార్థం. మొక్కకు సరైన నీరు లేకపోయినా, ఎక్కువ ఎండ పడినా, లేదా వాతావరణం సరిగ్గా లేకపోయినా ఈ పదార్థం పెరుగుతుంది. అప్పుడు కీరా చేదుగా మారుతుంది. అందుకే బయటకి బాగానే కనిపించినా లోపల చేదుగా ఉండొచ్చు. కీరా కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. ఆకుపచ్చగా ఉండాలి, మధ్యస్థ సైజ్ ఉండాలి, గట్టిగా ఉండాలి.. ఇలాంటి కీరాను ఎంపిక చేసుకుంటే మంచిది.

Also read: Sour Curd: వేసవిలో పెరుగు త్వరగా పులుస్తుందా? తాజాగా ఉండేందుకు ఇలా చిన్న పని చేయండి చాలు

Related News

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

Big Stories

Advertisement
×