E-Paper
Advertisement

Tirumala Darshan: తిరుమలలో త్వరగా దర్శనం చేసుకోవడానికి ఏడు మార్గాలు – అవేంటో తెలుసా

Tirumala Darshan: తిరుమలలో త్వరగా దర్శనం చేసుకోవడానికి ఏడు మార్గాలు – అవేంటో తెలుసా

Tirumala Darshan: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? అయితే దర్శనం త్వరగా  చేసుకోవడానికి ప్రాధాన్యతా క్రమంలో ఏడు మార్గాలు ఉన్నాయట. ఆ ఏడు మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు లక్షల మంది భక్తులు వస్తుంటారు. వీరిలో చాలా మంది ఉచిత దర్శనం చేసుకుంటే మరికొందరు స్పెషల్‌ ఎంట్రీ దర్శనం.. శ్రీవాని ట్రస్ట్‌ దర్శనం… వీఐపీ దర్శనం చేసుకుంటుంటారు. అయితే ఈ దర్శనాల్లో ప్రాధాన్యతా క్రమంలో ఏ దర్శనం అయితే త్వరగా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

తిరుమల శ్రీవారిని ఏడు రకాలైన దర్శనాల ద్వారా  దర్శించుకోవచ్చు వాటిలో అత్యంత ప్రాథాన్యత ఉన్న మొదటి దర్శనం  అర్జిత సేవల దర్శనం.

అర్జిత సేవల ద్వారా దర్శనం: తిరుమల శ్రీవారి దర్శనానికి అత్యంత ప్రాధాన్యత మరియు అత్యంత త్వరగా పూర్తయ్యే దర్శనం అర్జిత సేవల ద్వారా చేసుకునే దర్శనం. ఈ ఆర్జిత సేవల కోసం మూడు నెలల ముందుగానే ఈ డిప్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలి. ఈ డిప్‌లో టోకెన్‌ తగిలితే ఆయా సమయాలకు దర్శనానిక వెళ్ళోచ్చు. అయితే ఆప్‌లైన్‌ లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుమల సీఆర్‌వో ఆఫీసు దగ్గర కూడా డిప్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవచ్చు అదే సాయంత్రం డిప్‌ తగిలితే మీ రిజిస్టర్‌ మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది. మరుసటి రోజు దర్శనం మరియు సేవ ఉంటాయి. ఈ అర్జిత సేవలు ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్చన, సుప్రబాత సేవ, అష్టదళపాదపద్మారాదన సేవ ముఖ్యమైనవి. ఈ సేవలకు ఒక్కో సేవకు ఒక్కో రుసుము ఉంటుంది.

VIP బ్రేక్ దర్శనం: ఈ దర్శనం కోసం ఎవరైనా వీఐపీలు లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లాంటి వారితో సిఫారసు లేఖ ద్వారా దర్శనానికి వెళ్లొచ్చు. ఈ దర్శనం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా పూర్తవుతుంది.

TTD ట్రస్ట్ విరాళ  దర్శనం: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో నడిస్తున్న కొన్ని ట్రస్టులకు పెద్దమొత్తంలో విరాళాలు ఇవ్వడం ద్వారా కూడా శ్రీవారిని త్వరగా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తుంది టీటీడీ. వీటిలో ముఖ్యమైన ట్రస్ట్‌ శ్రీవాణి ట్రస్ట్‌, వేద పరిరక్షణ ట్రస్ట్‌

మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం (Sheeghra Darshan): చాలా మంది చేసుకునే దర్శనం ఈ శీఘ్ర దర్శనం. ఇది రూ. 300 టికెట్‌తో దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్‌ను ముందు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. భక్తులు తక్కువ ఉన్న సందర్భాల్లో ఈ దర్శనం 1 నుంచి 2 గంటల్లోనే అయిపోతుంది.

నడకదారి దర్శనం:  శ్రీవారి మెట్లు లేదా అలిపిరి మెట్లు ద్వారా నడక దారిలో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇలా నడకదారిలో వచ్చే భక్తులకు కూడా ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు మొదట అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్‌ తీసుకోవాలి.

ఇవే కాకుండా వృద్దులు, దివ్యాంగులు, చంటి బిడ్డలు ( ఒక సంవత్సరం లోపు) ఉన్న తల్లిదండ్రులకు సుపథం ఎంట్రీ నుంచి దర్శనానికి పంపిస్తారు. ఈ దర్శనం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా త్వరగా చేసుకోవచ్చు.

ALSO READ: నరదిష్టితో బాధపడుతున్నారా..? ఈ సింపుల్ రెమెడీస్ పాటించాలట

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×