E-Paper
Advertisement

ఖమ్మంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం.. రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

ఖమ్మంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం.. రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!
Advertisement

ISKCON Khammam: స్వేచ్ఛ బ్యూరో: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇస్కాన్ (ISKCON) సొసైటీ ద్వారా శ్రీ బలరామకృష్ణ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రఘునాథపాలెం గ్రామం, మండలపరిధిలో 4 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ భూమిని ఇస్కాన్ సొసైటీకి కేటాయిస్తూ గురువారం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఖమ్మంలో ఆధ్యాత్మిక-సాంస్కృతిక సేవా కేంద్రం ఏర్పాటు దిశగా ముందడుగు పడింది. జి.ఒ. 571 ప్రకారం భూమి కేటాయింపు 14-09-2012 తేదీగల రెవెన్యూ (అసైన్-I) శాఖ జి.ఒ.ఎం.ఎస్. నెం.571 నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ చెల్లింపుపై ఈ భూమిని కేటాయింపుకు నిర్ణయం తీసుకుంది. ఆశ్రమం,భజన మందిర్ నిర్మాణం కోసం ఇస్కాన్ సొసైటీ పేరుతో ఈ భూమి వినియోగించబడనుంది.

కలెక్టర్ ప్రతిపాదన..

మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ సమర్పించిన ప్రతిపాదనను తెలంగాణ భూపరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలించి 05-01-2026న ప్రభుత్వానికి నివేదించారు. అనంతరం టి.జి.ఎల్.ఎం.ఎ (తెలంగాణ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ) సమావేశంలో ఈ అంశాన్ని చర్చించి, మార్కెట్ విలువ చెల్లింపుపై భూమి కేటాయింపుకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

క్యాబినెట్ ఆమోదంతో ప్రాజెక్ట్‌కు ఊపిరి..

Advertisement

మంత్రిమండలి ఆమోదంతో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఖమ్మం నగరానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచే ఈ ప్రాజెక్ట్ త్వరలోనే నిర్మాణ దశలోకి వెళ్లే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయం ఖమ్మం అభివృద్ధికి తోడ్పడుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Also Read: హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్..?

ఖమ్మంలో ఇస్కాన్ మహా ప్రాజెక్టు..

Advertisement

ఖమ్మం నగరానికి ఆధ్యాత్మిక శోభను అందించే ఒక మహోత్తర ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషితో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇస్కాన్ (ISKCON) ఆలయ నిర్మాణం ప్రారంభమవడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఆలయం భక్తులకు శ్రీకృష్ణ భక్తి మార్గంలో సేవలు అందించడమే కాకుండా గీతా ప్రచారం, సత్సంగాలు, ధార్మిక కార్యక్రమాలకు వేదికగా నిలవనుంది.

సమగ్ర ఆధ్యాత్మిక -సామాజిక ప్రాజెక్ట్

ఖమ్మం జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం (ISKCON) ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఆలయం సాధారణ దేవాలయ నిర్మాణం కాదు. ఇది భక్తి, విద్య, సేవ, గ్రామీణాభివృద్ధి అన్న నాలుగు స్తంభాలపై నిలబడే సమగ్ర ఆధ్యాత్మిక-సామాజిక ప్రాజెక్ట్. నగరానికి ఆధ్యాత్మిక గుర్తింపును మాత్రమే కాకుండా సమాజానికి దీర్ఘకాల ప్రయోజనాలను అందించనుంది. ఖమ్మంను ఆధ్యాత్మిక-సేవా కేంద్రంగా మలచే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

ఇస్కాన్ లక్ష్యాలు

శ్రీ శ్రీ బలరామ కృష్ణ ఆలయం నిర్మాణం, గోశాల ఏర్పాటు, అన్నదానం కార్యక్రమాలు, యోగా, ధ్యానం మరియు సాత్విక ఆహార అలవాట్ల ద్వారా ఆధునిక యువతను వేద జీవన విధానానికి అనుసంధానం చేయడం, పాఠశాల విద్యార్థుల కోసం భగవద్గీత బోధన-ప్రతి ఆదివారం తరగతులు మరియు వేసవి శిబిరాలు నిర్వహించడం, మహిళా సాధికారత, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, గిరిజన సంక్షేమం.

Also read: గులాబీ పార్టీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై కన్నేసిన కవిత..!

శ్రీ శ్రీ బలరామ-కృష్ణ ఆలయం: భక్తి, వాస్తు, సంస్కృతి సమ్మేళనం

ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన ప్రత్యేక ఆకర్షణగా నిలిచే శ్రీ శ్రీ బలరామ-కృష్ణ ఆలయం వేద శిల్పకళా సౌందర్యాన్ని ప్రతిబింబించేలా నిర్మాణం కానుంది. విశాల ప్రాంగణం, నిత్య పూజలు, భజనలు, ఉత్సవాలతో ఇది భక్తులను ఆకర్షించనుంది. నగర జీవన ఒత్తిడిలో మానసిక ప్రశాంతత కోరుకునే వారికి ఇది ఆధ్యాత్మిక ఆశ్రయంగా మారే అవకాశం ఉంది. పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఖమ్మం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లనుంది. దీంతో పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహించే అవకాశముంది.గోశాల ఏర్పాటు ద్వారా గోసంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం మాత్రమే కాదు, సాంప్రదాయ భారతీయ వ్యవసాయ,ఆహార వ్యవస్థలను ప్రజలకు అనుసంధానం చేయాలనే లక్ష్యం ఉంది.

ఖమ్మానికి కొత్త రూపు: ఆధ్యాత్మిక కేంద్రం గా రూపాంతరం

ఖమ్మంలో ఇప్పటికే ఒక పక్క అల్లీపురంలో టిటిడి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం కానుండగా, మరొపక్క రఘునాధపాలెంలో ఇస్కాన్ ద్వారా శ్రీ బలరామ కృష్ణ దేవాలయ నిర్మాణం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అమలు అయితే, ఖమ్మం జిల్లా ఒక ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా నిలవనుంది. భక్తి, విద్య, సేవల సమన్వయంతో ఇది రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందే అవకాశముంది. పర్యాటక రంగానికి కూడా ఇది ఊతమిచ్చేట్లుంటది. ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం ఖమ్మానికి కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, సమాజంలోని విభిన్న వర్గాల సమగ్ర అభివృద్ధికి, ఖమ్మం భవిష్యత్తుకు కొత్త దిశను చూపనుంది. వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నైతికత ఈ మూడు అంశాల్లో యువతను బలపరచడంలో శిక్షణ కీలక పాత్ర పోషించగలదు.

విద్యార్థులకు భగవద్గీత బోధన

ప్రతి ఆదివారం భగవద్గీత తరగతులు, వేసవి శిబిరాల ద్వారా విద్యార్థుల్లో చిన్న వయసులోనే ఆధ్యాత్మికతను పెంపొందిచడం, నైతికత విలువలు, బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ప్రయత్నం జరుగుతుంది.

Also Read: తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం మంత్రుల జీతాల్లో కోత!

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×