E-Paper
Advertisement

మెగా మేనల్లుడి ‘ఓవర్ కాన్ఫిడెన్స్’? చేతిలో సినిమాలు లేవు కానీ.. అప్పుడే ప్రొడక్షన్ హౌస్ అంటూ రిస్క్!

మెగా మేనల్లుడి ‘ఓవర్ కాన్ఫిడెన్స్’? చేతిలో సినిమాలు లేవు కానీ.. అప్పుడే ప్రొడక్షన్ హౌస్ అంటూ రిస్క్!
Advertisement

Sai Durga Tej: మొదట్లో పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ వరుస హిట్స్ చూసిన ఈ మెగా మేనల్లుడి కెరీర్ గ్రాఫ్ ఇప్పుడు డేంజర్లో పడినట్టే కనిపిస్తుంది. మోస్తరు అంచనాలతో బరిలోకి దిగిన విరూపాక్ష ఊహించని సక్సెస్ చూసింది. కానీ ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ని మాత్రం సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయాడు.ఇక ఇప్పుడు సంబరాల ఏటిగట్టుతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా, షూటింగ్ డిలేతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలీని పరిస్థితి. ఇక ఈ సినిమా కోసం ప్రాణం పెడుతున్నాను అని తేజ్ చెబుతున్నా, ప్రేక్షకుల్లో మాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు మేకర్స్.

సినిమాలు తీయడానికి రెడీ

Advertisement

ఇక ఇవన్నీ ఇలా ఉంటే..తేజ్ ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. అవును.. ‘విజయ్ దుర్గ ప్రొడక్షన్స్’ పై సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నాడట ఈ మెగా మేనల్లుడు.సాధారణంగా సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నప్పుడో లేదా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడో ప్రొడ్యూసర్లుగా మారడం మనం చూస్తుంటాం. కానీ హీరోగా కెరీర్‌ను ఇలా డైలామాలో పెట్టుకుని నిర్మాతగా టర్న్ తీసుకోవడం ఏంటన్నది మెగా ఫ్యాన్స్‌ను వేధిస్తున్న ప్రశ్న.

ALSO READ :‘బెటర్ హాఫ్’ అంటే కేవలం భార్య మాత్రమేనా? ఈ పదం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా!

Advertisement

నిర్మాతగా నిలబడగలడా?

అసలే తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీయడం అంటే అంత ఆషామాషీ కాదు. ఇక మెగా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయనుకుంటే అంతకన్నా భ్రమ మరోటి ఉండదు.మరోవైపు పవర్ స్టార్ వంటి వాళ్ల సినిమాలకే నష్టాలు వచ్చే పరిస్థితి ఇక్కడ. పైగా హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయంలో ఈ వ్యాపారాలు అవసరమా? అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.మరి తన సొంత బ్యానర్‌లో తనే హీరోగా నటించి సేఫ్ గేమ్ ఆడదామనుకుంటున్నాడా? లేక కొత్త వాళ్లను నమ్మి కోట్లు తగలేస్తాడా? చూడాలి.ఇక ప్రొడక్షన్ సంగతి ఇలా ఉంటే మరో పక్క సుజీత్, సందీప్ వంటి క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు ఉన్నాయన్న వార్తలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్‌లో ఒక్కటీ ఫిక్స్ అయినట్లు కనిపించడం లేదు.‘సంబరాల ఏటి గట్టు’ రిజల్ట్ తేడా కొడితే ఈ డైరెక్టర్లందరూ జంప్ అవ్వడం ఖాయమన్న సంగతి తేజు గుర్తు పెట్టుకుంటే మంచిది.

మెగా ట్యాగ్ ఒక్కటే సరిపోదు బాసూ!

ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నా జనం ఇంకా తేజు ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారన్నది వాస్తవం. కానీ ఇదే గ్యాప్ ఇంకో హీరోకి గనుక వచ్చి ఉంటే ఈపాటికి కనుమరుగైపోయేవాడు కూడా.యాక్సిడెంట్ తర్వాత వచ్చిన విరామం సరే, మరి ఆ తర్వాత తీసుకున్న ఈ మూడేళ్ల గ్యాప్ తేజ్ కెరీర్‌ను ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి.వరుస సినిమాలతో వస్తానని చెబుతున్న తేజ్, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే మాత్రం నిర్మాతగా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ తప్పదు.

ఏది ఏమైనా సాయి దుర్గ తేజ్ చేస్తున్న ఈ ప్లాన్లు ‘మెగా’ రిస్క్ లాగే కనిపిస్తున్నాయి. మరి సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఈ రెండు పడవల ప్రయాణంపై తేజు ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి!

ALSO READ :ప్రశాంత్ నీల్ సెట్స్ నుండి క్రేజీ లీక్… ‘డ్రాగన్’ యాక్షన్ విజువల్స్ వైరల్!

Related News

విడుదలకు ముందే 3 స్టేట్ అవార్డ్స్.. ఆరేళ్ల తర్వాత రిలీజ్ కాబోతున్న శ్రియా మూవీ!

రాజమౌళితో సినిమా అరుదైన రికార్డు సాధించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ !

జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ.. నాగవంశీ ఫ్యాన్సీ ఆఫర్!

ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి!

రామాయణం నుండి స్పెషల్ ట్రీట్ .. ఆకట్టుకుంటున్న ‘సీతారామ్’ పోస్టర్!

వినాయక చవితి స్పెషల్..నయనతార మూకుత్తి అమ్మన్ 2 టీజర్ రిలీజ్!

Varanasi Leak : గుడి దగ్గర ఆ డైనోసర్ ఏంటి..జక్కయ్య నీ ప్లానేంటి సామి..?

గణనాథుడి ఆశీస్సులు అందరికి ఉండాలి.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..

Big Stories

Advertisement
×