E-Paper
Advertisement

వడదెబ్బ నుంచి రక్షణ కల్పించే ఉల్లిపాయ.. వేసవిలో దీనిని మించిన మెడిసిన్ మరొకటి లేదు!

వడదెబ్బ నుంచి రక్షణ కల్పించే ఉల్లిపాయ.. వేసవిలో దీనిని మించిన మెడిసిన్ మరొకటి లేదు!
Advertisement

Summer Health Tips: మండిపోయే ఎండలు ఒకవైపు.. ఉక్కిరిబిక్కిరి చేసే వడగాల్పులు మరోవైపు. ఈ వేడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వంటింట్లో ఉండే ఉల్లిపాయ ఒక అద్భుతమైన ఔషధం అనే చెప్పాలి. వేసవి తాపం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవడమే కాకుండా కడుపులో మంట, విపరీతమైన కోపం, ఇంకా పరిస్థితి విషమిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మన పెద్దలు ఎండలోకి వెళ్లేటప్పుడు జేబులో ఉల్లిపాయ పెట్టుకోమని చెబుతుంటారు. దీనికి శాస్త్రీయంగా గట్టి రుజువులు లేకపోయినా.. ఉల్లిలోని కొన్ని ప్రత్యేక నూనెలు శరీర వేడిని లాగేసి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతాయని వైద్య నిపుణులు కూడా నమ్ముతారు.

రెడ్ ఆనియన్‌తో ఎన్నో లాభాలు:

ఉల్లిపాయను కేవలం కూరలకు రుచి ఇచ్చే ముక్కలుగానే కాకుండా.. ఒక మంచి మందులా చూడాలి. ముఖ్యంగా ఎర్ర ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే గుణం అలర్జీలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. వేసవి కాలంలో పచ్చి ఉల్లిపాయను తింటే ఎండ వల్ల వచ్చే నీరసం, వడగాల్పుల ప్రభావం మన దరిచేరవు. ఉల్లిలో ఉండే పొటాషియం, సోడియం వంటి గుణాలు శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎండను తట్టుకునే మొండితనం మన శరీరానికి వస్తుంది.

Advertisement

Also Read: బాత్‌రూమ్ మూలలో ఉప్పు గిన్నె ఎందుకు పెడతారో తెలుసా? దీని వెనుకున్న రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఉల్లిని ఎలా తింటే మంచిది?

ఆయుర్వేదం చెప్పే దాని ప్రకారం.. పచ్చి ఉల్లిపాయను కొంచెం సెగపై కాల్చి, దానికి కాస్త జీలకర్ర పొడి, తేనె కలిపి తింటే ఒంట్లోని వేడి ఇట్టే తగ్గిపోతుంది. ఇది లోపల ఉన్న ఉక్కపోతను తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. ఒకవేళ అలా తినడం ఇష్టం లేకపోతే.. పచ్చి ఉల్లిపాయ ముక్కలకు కొంచెం కొత్తిమీర కలిపి చట్నీలా చేసుకుని భోజనంలో తిన్నా చాలా మంచిది. చర్మంపై ఎండ వల్ల వచ్చే పొక్కులు లేదా కందిపోయిన చోట ఉల్లి రసం రాస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

వడదెబ్బ తగిలితే ఇలా చేయండి:

Advertisement

దురదృష్టవశాత్తు ఎవరికైనా వడదెబ్బ తగిలితే.. వెంటనే ఉల్లిపాయ రసాన్ని లేదా పేస్ట్‌ను వారి నుదురు, ఛాతి, పాదాల అడుగు భాగంలో రాయాలి. ముఖ్యంగా చెవి వెనుక భాగంలో ఉల్లి రసం రాస్తే శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఇది రక్త ప్రసరణను మళ్లీ దారిలో పెట్టి ప్రాణాపాయం కలగకుండా చూస్తుంది.

హైడ్రేటెడ్‌గా ఉండాలి:

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం నీళ్లు తాగితే సరిపోదు. మజ్జిగ, లస్సీ, పచ్చి మామిడికాయతో చేసే ఆమ్ పన్నా వంటి పానీయాలు ఎక్కువగా తాగాలి. ఇవి శరీరానికి చల్లదనంతో పాటు తక్షణ శక్తిని ఇస్తాయి. ఎవరికైనా తల తిరగడం, వాంతి వచ్చినట్టు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఉప్పు, చక్కెర కలిపిన నీటిని తాగించాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే వేసవిలో వడదెబ్బ అనేది దరిచేరదు.

Also Read: జమ్మి మొక్కను ఏ దిశలో నాటితే అదృష్టం వరిస్తుంది? పూర్తి వివరాలు మీ కోసం..

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×