E-Paper
Advertisement

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!
Advertisement

Jhalmuri Recipe: భారతదేశంలో కొన్ని వంటకాలు ఫైవ్ స్టార్ హోటళ్లలో కంటే రోడ్డు పక్కన ఉండే బండ్ల దగ్గరే చాలా రుచిగా ఉంటాయి. అతి తక్కువ ధరలో దొరికే ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ ఎప్పుడూ జనాలకు ఫేవరెటే. తాజాగా బెంగాల్‌కు చెందిన ‘జాల్ముడి’ అనే చిరుతిండి ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బెంగాల్ పర్యటనలో ఒక చిన్న బండి దగ్గర ఆగి, ఈ జాల్ముడిని ఎంతో ఇష్టంగా రుచి చూశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అసలు ఈ జాల్ముడి ఏంటి? దీన్ని ఎలా తయారు చేయాలి? అని అందరూ గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు.

జాల్ముడి అంటే?

కోల్‌కతా వీధుల్లో అడుగుపెడితే ఎక్కడ చూసినా ఈ జాల్ముడి బండ్లు కనిపిస్తాయి. ‘జాల్’ అంటే బెంగాలీలో కారం అని, ‘ముడి’ అంటే బొరుగులు (మరమరాలు) అని అర్థం. అంటే కరకరలాడే కారపు బొరుగులు అన్నమాట. మన దగ్గర దొరికే భేల్ పూరి లేదా పిడత కింద పప్పు లాగే ఇది ఉంటుంది కానీ, ఇందులో వాడే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు దీనికి ఒక విభిన్నమైన రుచిని ఇస్తాయి. బెంగాలీ స్టైల్‌లో ఘాటుగా ఉండే ఈ స్నాక్ కేవలం పదిహేను నిమిషాల్లోనే ఇంట్లో సిద్ధం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

కావలసిన పదార్థాలు:

దీని తయారీకి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులే సరిపోతాయి. ఒకటిన్నర కప్పుల బొరుగులు, అర కప్పు మిక్చర్ లేదా నమ్కీన్, ఒక ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక కీరదోసకాయ, పచ్చిమిర్చి, వేయించిన వేరుశెనగ పప్పులు, తగినంత ఉప్పు, కొంచెం జాల్ముడి మసాలా (లేదా చాట్ మసాలా), కొత్తిమీర, నిమ్మరసం, సన్న కారప్పూస (సేవ్) సిద్ధం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా దీనికి అసలైన రుచిని ఇచ్చేది రెండు చెంచాల పచ్చి ఆవనూనె.

తయారీ విధానం ఇలా:

Advertisement

ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో బొరుగులు పోయాలి. ఆ తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయ, టమాటా, కీరదోస, ఉడికించిన ఆలుగడ్డను వీలైనంత సన్నగా ముక్కలు కోసి అందులో వేయాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, వేయించిన పల్లీలు, మిక్చర్ కూడా కలపాలి. ఇప్పుడు పైన చెప్పిన మసాలాలు, ఉప్పు వేసి, ఆవనూనెను పోయాలి. ఈ ఆవనూనె వల్లే ఈ స్నాక్‌కు ఒక ప్రత్యేకమైన ఘాటు వస్తుంది.

చివరగా నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి అంతా కలిసేలా బాగా కలపాలి. దీన్ని కలిపిన వెంటనే తింటేనే ఆ కరకరలాడే రుచి తెలుస్తుంది. సేవ్ లేదా కారప్పూసను పైన గార్నిష్‌లా చల్లుకుంటే అచ్చం కోల్‌కతా వీధుల్లో దొరికే జాల్ముడి తయారైనట్లే. సాయంత్రం పూట ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇదొక అద్భుతమైన ఆప్షన్ అనే చెప్పాలి.

Also Read: వెజ్ ఓట్స్ ఉప్మా.. డయాబెటిస్ ఉన్నవారికి, డైట్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×