Body heat symptoms: ఫిట్‌నెస్ మీద ఇంట్రెస్ట్‌తో జిమ్‌లో గంటల కొద్దీ చెమటలు చిందిస్తున్నారా? హెల్తీ డైట్ ఫాలో అవుతున్నా సరే.. అకస్మాత్తుగా నీరసం రావడం, నోటి పూత లేదా మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే మీ శరీరంలో ఉష్ణోగ్రత లేదా వేడి విపరీతంగా పెరిగిపోయిందని అర్థం. చాలా మంది దీనిని నార్మల్ అలసట అనుకుని లైట్ తీసుకుంటారు. కానీ.. సమయానికి బాడీని కూల్ చేయకపోతే కండరాలు పట్టేయడం దగ్గరి నుంచి కిడ్నీ సమస్యల వరకు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అసలు బాడీ హీట్‌ను ఎలా గుర్తించాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడే చూసేద్దాం.
శరీరంలో వేడి పెరిగినప్పుడు కనిపించే 5 ముఖ్యమైన లక్షణాలు:
1.మూత్రంలో మంట,కలర్ మారడం:
బాడీలో వేడి పెరిగినప్పుడు కనిపించే మొదటి సైన్ ఇది. మీరు వాష్ రూమ్‌కి వెళ్లినప్పుడు యూరిన్ విపరీతమైన మంటగా అనిపిస్తుంది. అలాగే మూత్రం తెల్లగా కాకుండా ముదురు పసుపు రంగులోకి మారుతుంది. దీని అర్థం మీ బాడీ తీవ్రమైన నీటి కొరతతో బాధపడుతోంది.
2.నోటి పూత, గొంతు ఎండిపోవడం:
ఒంట్లో హీట్ ఎక్కువైతే నాలుక మీద, పెదవుల లోపలి భాగంలో చిన్న చిన్న బొబ్బలు లేదా నోటి పూత వస్తుంది. ఏదైనా తినాలన్నా.. తాగాలన్నా విపరీతమైన మంట పుడుతుంది. దీంతో పాటు ఎంత నీళ్లు తాగినా గొంతు ఎండిపోతున్నట్టు అనిపిస్తుంది.
3.చర్మంపై మొటిమలు, వేడి కురుపులు:
వర్కవుట్స్ చేసేవారిలో బాడీ హీట్ పెరిగితే అది చర్మం ద్వారా బయటకు రావడానికి ట్రై చేస్తుంది. ఫలితంగా ముఖంపై హఠాత్తుగా మొటిమలు రావడం, వీపు, చేతులపై చిన్న చిన్న చెమట కాయలు లేదా వేడి కురుపులు రావడం జరుగుతుంది. చర్మం అంతా డ్రైగా మారి దురద పెడుతుంది.
4.కళ్లు మండటం , తలనొప్పి :
సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు లేదా నార్మల్‌గా ఉన్నప్పుడు కూడా కళ్లు విపరీతంగా మండుతుంటాయి. కళ్లు ఎర్రబడటం కూడా బాడీ హీట్ లక్షణమే. దీనితో పాటు తల వెనక భాగంలో ఒక రకమైన భారంగా ఉంటూ, తలనొప్పి వేధిస్తుంది.
5.అకస్మాత్తుగా కండరాలు పట్టేయడం:
జిమ్‌లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు లేదా రన్నింగ్ చేసేటప్పుడు హఠాత్తుగా కాళ్లు, చేతుల కండరాలు గట్టిగా పట్టేస్తాయి. బాడీలో హీట్ పెరిగి ఎలక్ట్రోలైట్స్ లెవెల్స్ పడిపోవడం వల్లే ఈ క్రాంప్స్ వస్తాయి.
పట్టించుకోకపోతే వచ్చే ప్రమాదాలు:
“లైట్ తీసుకో బ్రో.. అదే తగ్గిపోతుంది” అని బాడీ హీట్‌ను నిర్లక్ష్యం చేస్తే ఈ కింది సమస్యలు తప్పవు.
హీట్ ఎగ్జాస్టిన్ & వడదెబ్బ: బాడీ టెంపరేచర్ కంట్రోల్ తప్పితే మైకం రావడం, వాంతులు అవ్వడం లేదా స్పృహ తప్పి పడిపోయే ప్రమాదం ఉంది.
జీర్ణక్రియ అస్తవ్యస్తం: కడుపులో విపరీతమైన మంట, గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం సమస్యలు చుట్టుముడతాయి.
కిడ్నీలో రాళ్లు: ఒంట్లో వేడి అలాగే ఉండిపోతే కిడ్నీలపై లోడ్ పడి లాంగ్ టర్మ్‌లో కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.
Also Read: ప్రోటీన్ ఎక్కువైతే ప్రమాదమే! అవసరానికి మించి తింటే వచ్చే 5 షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్!
బాడీని ఇన్‌స్టంట్‌గా కూల్ చేసే సింపుల్ ట్రిక్స్:
వాటర్ థెరపీ: రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
నేచురల్ కూలర్స్: సమ్మర్ అయినా, నార్మల్ సీజన్ అయినా వారంలో కనీసం మూడు సార్లు కొబ్బరినీళ్లు, మజ్జిగ లేదా సబ్జా గింజల నీళ్లు తాగండి. ఇవి బాడీ హీట్‌ను మ్యాజిక్‌లా తగ్గిస్తాయి.
డైట్ మార్చుకోండి: మసాలాలు, ఆయిల్ ఫుడ్స్, చికెన్ లాంటి హీట్ జనరేట్ చేసే ఆహారాన్ని కొద్దిరోజులు పక్కన పెట్టి.. దోసకాయ, పుచ్చకాయ, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి.
ఫిట్‌గా ఉండటం అంటే కేవలం సిక్స్ ప్యాక్ లేదా మజిల్స్ పెంచడం మాత్రమే కాదు.. బాడీ లోపల జరిగే మార్పులను గమనించడం కూడా. మీ శరీరంలో పైన చెప్పిన లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే అలర్ట్ అవ్వండి. బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి, ఇన్‌స్టంట్‌గా వేడిని తగ్గించుకుని మీ ఫిట్‌నెస్ జర్నీని హెల్తీగా ఎంజాయ్ చేయండి.