E-Paper
Advertisement

Health Tips: సెంచరీ కొట్టాలా? నిండు నూరేళ్లు జీవించడానికి అనుసరించాల్సిన గోల్డెన్ రూల్స్.

Health Tips: సెంచరీ కొట్టాలా? నిండు నూరేళ్లు జీవించడానికి అనుసరించాల్సిన గోల్డెన్ రూల్స్.
Advertisement

Health Tips: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రోజులు ఆరోగ్యకరమైన జీవితం గడపడంలో జపనీయులు ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లోని ఒకినావా వంటి ప్రాంతాలలో.. 100 సంవత్సరాల వయస్సుకు చేరుకున్న వారి సంఖ్య అత్యధికం.వృద్ధాప్యంలో కూడా వారు వ్యాధుల బారిన పడకుండా.. శక్తివంతంగా ఉంచే వారి జీవనశైలి, ఆహార నియమాల్లో వారి దీర్ఘాయువు రహస్యం దాగి ఉంది. శతాబ్దాల నాటి ఆరోగ్యకరమైన అలవాట్లు , క్రమశిక్షణ కూడా ఇందుకు కారణం అని నిపుణులు చెబుతున్నారు.

జపనీస్ ఆహారాన్ని కేవలం కడుపు నింపుకునే మార్గంగా కాకుండా ఔషధంగా చూస్తారు. రుచిని వెతుక్కుంటూ.. మనం ప్లేట్లలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, ఇతర పోషకాలను తక్కువగా తీసుకుంటాము. ఈ అలవాటు చిన్న వయసులోనే వివిధ వ్యాధుల బారిన పడటానికి కారణం అవుతుంది.

Advertisement

జపనీస్ లైఫ్ స్టైల్, ఆహార నియమాలు:

ఆరోగ్యకరమైన ఆహారం:
మనం ప్రధానంగా రోటీ, రైస్ ఎక్కువగా తింటుంటాం. కానీ జపనీయులు తక్కువ కార్బోహైడ్రేట్లు, మితమైన ప్రోటీన్ , అత్యధిక ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటారు. మన భోజనంలో తృణధాన్యాలు తగ్గించి, కూరగాయలు, పప్పుధాన్యాలను పెంచితే, మనం అనేక వ్యాధులను నివారించవచ్చు.

Advertisement

తక్కువగా తినడం:
దీర్ఘాయుష్షుకు మరో ముఖ్యమైన మంత్రం “హర హచి బు.” దీని అర్థం ఒకరు తమ కడుపును 80 శాతం మాత్రమే నింపి మిగిలిన 20 శాతం ఖాళీగా ఉంచాలి. మనం పూర్తిగా కడుపు నిండిపోయే వరకు తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగుతుంది. జపనీయులు ఫాలో అయ్యే 80% నియమం అతిగా తినకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

సరైన భోజన క్రమం:
మనం రోటీ లేదా అన్నంతో భోజనం ప్రారంభిస్తాము. కానీ ముందుగా కూరగాయలు తినడం మంచిది. మీ భోజనాన్ని సలాడ్లు, పులియబెట్టిన ఆహారాలతో ప్రారంభించండి, తరువాత వండిన ఆకుకూరలు లేదా కూరగాయలు, చివరగా ధాన్యాలు తీసుకోండి. ఈ క్రమం రక్తంలో చక్కెరలో హెచ్చుతగ్గులను నివారిస్తుంది. అంతే కాకుండా శరీరం ఆహారంలోని అన్ని పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.

Also Read: పార్లర్‌కి వెళ్లక్కర్లేదు ! ఇంట్లోనే ఈ బీర్ ఫేస్ ప్యాక్‌తో ఇన్స్టంట్ గ్లో గ్యారంటీ

తక్కువ వంట నూనె:

జపనీయులు ఆహారాన్ని డీప్-ఫ్రై చేయడానికి బదులుగా తక్కువ నూనెతో వంట చేసే విధానాన్ని ఉపయోగిస్తారు. ఆవిరి మీద ఉడికించడం, గ్రిల్ చేయడం, సిమ్మింగ్ చేయడం, మరిగించడం వంటి వంట పద్ధతులను ఉపయోగించాలి. అధిక నూనెతో, అధిక ఉష్ణోగ్రతల వద్ద వండిన ఆహారం దాని పోషకాలను కోల్పోతుంది. అంతే కాకుండా ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. తక్కువ నూనెతో, తక్కువ వేడి మీద వండిన ఆహారాన్ని తినడం దీర్ఘాయువుకు చాలా కీలకం.

గ్రీన్ టీ :
మిల్క్ టీ లేదా కాఫీని ఎక్కువగా తాగడానికి బదులుగా గ్రీన్ టీ తీసుకోవడం మంచిది . గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ప్రతిరోజూ 1-2 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల శరీర జీవ క్రియను పెంచడంలో ,వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని తేలింది.

Related News

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

Big Stories

Advertisement
×