E-Paper
Advertisement

Kuja Dosham: కుజ దోషం అంటే ఏమిటి? దీనివల్ల ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది?

Kuja Dosham: కుజ దోషం అంటే ఏమిటి? దీనివల్ల ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది?
Advertisement

కుజ దోషం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యంగా వివాహ సమయంలో మాట్లాడుకునే విషయం.జన్మ కుండలిలో కుజుడు అంటే అంగారకుడు నిర్దిష్ట స్థానాల్లో ఉన్నప్పుడు ఈ దోషం ఉన్నట్లు జ్యోతిష్కులు చెబుతారు. కుజుడు అగ్ని స్వభావం కల గ్రహం. ధైర్యం, కోపం, ఉత్సాహం, శారీరక శక్తి వంటి లక్షణాలకు ఈ గ్రహం కారకుడిగా చెప్పుకుంటారు. ఈ దోషం వల్ల వివాహం ఆలస్యం కావడం, దాంపత్య జీవితంలో కలహాలు, అభిప్రాయ భేదాలు వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వివాహానికి ముందు కుజ దోషం ఉందా లేదా అనే అంశాన్ని పెద్దలు ముఖ్యంగా చూస్తారు.

కుజ దోషం ఉందని ఎలా తెలుస్తుంది?
సాధారణంగా లగ్నం, చంద్రుడు ఉన్న స్థానం ఆధారంగా కుజుడు మొదటి, రెండో, నాలుగో, ఏడో, ఎనిమిదో, పన్నెండో స్థానాల్లో ఉన్నప్పుడు కుజ దోషం ఉన్నట్లు భావిస్తారు. ఈ స్థానాలు వివాహ జీవితం, కుటుంబ సుఖం, మానసిక స్థిరత్వంతో సంబంధం కలిగి ఉంటాయని జ్యోతిష్కులు చెబుతారు. కుజుడు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు వ్యక్తిలో అధిక ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు, సహన లోపం కనిపించవచ్చని అంటారు. ఫలితంగా దాంపత్య బంధంలో చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుందని అంటారు. అయితే ప్రతి కుజ స్థానం ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వదు. ఇతర గ్రహాల దృష్టిని బట్టి కూడా ఇది మారుతుంది.

Advertisement

అయితే కుజదోషం ఉన్నవారికి పెళ్లి కాదని అర్థం కాదు. కుజుడు మేషం, వృశ్చికం వంటి సొంత రాశుల్లో ఉన్నప్పుడు దోష ప్రభావం తగ్గుతుందని భావిస్తారు. అలాగే గురుడు లేదా శుక్రుడు వంటి శుభ గ్రహాల దృష్టి కుజుడిపై పడితే ప్రతికూలతలు తగ్గుతాయని నమ్మకం ఉంది. వరుడు, వధువు ఇద్దరి కుండలీల్లో సమానమైన కుజ స్థానం ఉన్నప్పుడు కూడా దోష తీవ్రత తక్కువగా భావిస్తారు.కాబట్టి కుజ దోషం గురించి భయపడాల్సిన అవసరం లేదని అనుభవజ్ఞులైన జ్యోతిష్కులు చెబుతున్నారు.

కుజ దోషం పరిహారాలు
కుజ దోషం ఉన్న వారికి చిన్న చిన్న పరిహారాలు చేయవచ్చు. మంగళవారం రోజున అంగారకుడికి ఎరుపు పుష్పాలతో పూజ చేయడం, హనుమాన్ ఆరాధన చేయడం మంచి పరిహారాలుగా చెప్పుకుంటారు. నవగ్రహ స్తోత్రాలు, ముఖ్యంగా కుజ గ్రహ మంత్ర జపం చేయడం ద్వారా మనసుకు ధైర్యం, శాంతి లభిస్తుందని అంటారు. కొన్ని ప్రాంతాల్లో కుజ దోష నివారణ కోసం కుంకుమార్చన, నవగ్రహ హోమం వంటి పనులు చేస్తే మంచిది. ఇవి ఆధ్యాత్మికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని భావిస్తారు.

Advertisement

అసలు పరిహారం అనేది కేవలం పూజలు, హోమాలు మాత్రమే కాదని కొందరు పండితులు చెబుతారు. వ్యక్తిగత ప్రవర్తనలో మార్పు, మృదువుగా మాట్లాడడం వంటివి చేయాలి. కోపాన్నిఅదుపులో పెట్టుకునేందుకు, ధ్యానం, యోగా వంటివి పాటించాలి. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం, అవగాహన పెంచుకోవడం ద్వారా అనేక సమస్యలు దూరమవుతాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×