E-Paper
Advertisement

కెమికల్స్ లేకుండా మౌత్‌వాష్ ఇంట్లోనే తయారు చేయండి.. జామ ఆకులతో పంటి సంరక్షణ

కెమికల్స్ లేకుండా మౌత్‌వాష్ ఇంట్లోనే తయారు చేయండి.. జామ ఆకులతో పంటి సంరక్షణ
Advertisement

జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే జామ పండ్లే కాదు జామ చెట్టు ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి సహాయపడతాయి. జామ ఆకుల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే చిగుళ్ల వాపు, నొప్పిని కూడా తగ్గిస్తాయి. ఈ ప్రాకృతిక మౌత్‌వాష్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చాలా సులభంగా లభిస్తాయి.

ఈ మౌత్‌వాష్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

తయారీ కోసం కావాల్సిన పదార్థాలు

Advertisement

తాజా జామ ఆకులు .. 8 నుంచి 10
శుభ్రమైన నీరు .. 2 కప్పులు
ఉప్పు .. 1 టీస్పూన్ (తగినంత)
ఈ పదార్థాలు సాధారణంగా ప్రతి ఇంట్లో అందుబాటులో ఉంటాయి.

జామ ఆకులతో మౌత్‌వాష్‌ను ఎలా తయారు చేయాలి

ముందుగా జామ ఆకులను శుభ్రంగా కడగాలి. ఆకులపై ఉన్న దుమ్ము, మురికిని పూర్తిగా తొలగించాలి. తర్వాత ఒక చిన్న పాత్రలో రెండు కప్పుల నీరు పోయాలి. అందులో శుభ్రం చేసిన జామ ఆకులను వేయాలి. తక్కువ మంటపై ఈ నీళ్లను మరిగించాలి. కొన్ని నిమిషాల తర్వాత ఆకులలోని పోషకాలు నీటిలో కలుస్తాయి. నీరు లేత ఆకుపచ్చ రంగులోకి మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కావాలనుకుంటే ఒక టీస్పూన్ ఉప్పు కలపవచ్చు. ఇంకేముంది.. మీ న్యాచురల్ మౌత్‌వాష్ రెడీ.

ఈ మౌత్‌వాష్‌ను సరైన విధంగా ఉపయోగించడం ముఖ్యం

Advertisement

సాధారణంగా మార్కెట్‌లో దొరికే మౌత్‌వాష్‌ను ఎలా ఉపయోగిస్తారో అదే విధంగా దీన్ని కూడా ఉపయోగించాలి. కొద్దిగా మౌత్‌వాష్‌ను నోటిలో తీసుకోవాలి. దాన్ని సుమారు 30 సెకన్ల పాటు నోటిలో బాగా పుక్కిలించాలి. ఈ ద్రవం దంతాల మధ్య, నోట్లో అన్ని భాగాలకు చేరేలా చూసుకోవాలి. ఆ తర్వాత దాన్ని పూర్తిగా ఉమ్మేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మింగకూడదు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

Also Read: ఫ్రిజ్‌లో పెట్టిన అన్నం తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? క్యాన్సర్ డాక్టర్ చెప్పిన సమాధానమిదే

జామ ఆకుల మౌత్‌వాష్ వల్ల కలిగే ప్రయోజనాలు 

ఈ సహజ మౌత్‌వాష్ నోట్లో హానికరమైన బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గి తాజాదనం ఎక్కువసేపు ఉంటుంది. చిగుళ్ల వాపు, రక్తస్రావం వంటి సమస్యలను కూడా తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. దంతాల చుట్టూ పేరుకుపోయే ప్లాక్‌ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నోటి పూతలు మళ్లీ మళ్లీ రావడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఈ విధంగా పూర్తిస్థాయిలో నోటి పరిశుభ్రత మెరుగుపడుతుంది.

మౌత్‌వాష్‌ను సరైన విధంగా నిల్వ చేయాలి

తయారుచేసిన మౌత్‌వాష్‌ను శుభ్రమైన గాజు సీసాలో నిల్వ చేయాలి. దాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.
మూడు రోజులలోపు ఉపయోగిస్తే దాని ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కొత్త మిశ్రమాన్ని తయారు చేసుకోవడం ఉత్తమం.
కెమికల్స్ లేకుండా సహజంగా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారికి జామ ఆకుల మౌత్‌వాష్ మంచి ఆప్షన్.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×