Allu Politics : సినిమాలకి రాజకీయాలకి దగ్గర సంబంధం ఉందన్న సంగతి తెల్సిందే.సిల్వర్ స్క్రీన్ పై మెప్పించి తెచ్చుకున్న క్రేజ్ తో ఏకంగా సీయం సీటు ఎక్కేశారు కూడా. నాడు ఎన్టీఆర్, ఎంజీఆర్ నుంచి.. నిన్నటి పవన్ కళ్యాణ్ తమిళ స్టార్ దళపతి విజయ్ వరకు ఎందఱో ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు కనిపిస్తారు కూడా.
ముఖ్యంగా ఈ మధ్య ఏపీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ , అలాగే తమిళనాడులో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించి నేరుగా విజయ్ సిఎం పీఠమ్ ఎక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీశాయి. ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న ఒక క్రేజీ రూమర్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.
బన్నీ కూడా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధం?
అవును ..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం చేయాలని చూస్తున్నారనే టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. అచ్చం దళపతి విజయ్ అనుసరించిన వ్యూహాత్మక పంథాలోనే బన్నీ కూడా తన పొలిటికల్ ఎంట్రీకి సిద్ధం చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
also read :భారీ అంచనాల మధ్య రేసులోకి…జూలై 9న ‘శ్రీనివాస మంగాపురం’ ఎంట్రీ!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బన్నీ ఇటీవల కాలంలో దేశంలోనే ఫేమస్ అయిన కొందరు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లతో రహస్యంగా భేటీ అయ్యారట. ఈ చర్చల తాలూకు పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ, ఆయన రాబోయే 2029 ఎన్నికలను కాకుండా, ఏకంగా 2034 సాధారణ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని సుదీర్ఘకాలిక ప్రణాళికను (లాంగ్ టర్మ్ ప్లాన్) సిద్ధం చేసుకుంటున్నట్లు ఇన్ సైడ్ టాక్.
పక్కా గ్రౌండ్ వర్క్ తో రావాలనేదే ఆయన ప్లాన్
దళపతి విజయ్ ఏ విధంగానైతే దశాబ్ద కాలంగా తన ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ ద్వారా క్షేత్రస్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ బలమైన క్యాడర్ ను నిర్మించుకున్నారో, అల్లు అర్జున్ సైతం ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక వంటి ప్రాంతాలలో అపారమైన అభిమాన సంఘాల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న సంగతి తెల్సిందే.భవిష్యత్తులో రాజకీయంగా అడుగులు వేయాల్సి వస్తే, ఈ ఆర్మీనే తనకు బలమైన పునాదిగా మారుతుందని బన్నీ భావిస్తున్నట్లు పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం గ్లామర్ తో కాకుండా, పక్కా గ్రౌండ్ వర్క్ తో రావాలనేదే ఆయన ప్లాన్ అని సమాచారం.
also read :9 రోజుల్లోనే రూ.40 కోట్లు.. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్న మరాఠీ సినిమా
గతంలో నంద్యాల ఎన్నికల సమయంలో శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా వెళ్లి అల్లు అర్జున్ సృష్టించిన హల్ చల్ మనకు తెలిసిందే. అప్పుడే ఆయనకు ఉన్న మాస్ పల్స్ ఏంటో అందరికీ అర్థమైంది. అయితే ఈ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై అల్లు అర్జున్ క్యాంప్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు
బన్నీ ఎలా రియాక్ట్ అవుతాడో !
ప్రస్తుతం అల్లు అర్జున్ తన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ఫిలిం రాకా షూట్ లోబిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక లోకేష్ కనగరాజ్ సినిమా ఎలాగూ ఉండనే ఉంది.చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఈ పొలిటికల్ ఎంట్రీ రూమర్స్ పై బన్నీ ఎలా రియాక్ట్ అవుతాడో !