E-Paper
Advertisement

పీతలను ఇలా మసాలా పెట్టి వండితే.. ఆ వాసనకే కడుపు నిండిపోతుంది!

పీతలను ఇలా మసాలా పెట్టి వండితే.. ఆ వాసనకే కడుపు నిండిపోతుంది!
Advertisement

Crab Masala Curry: సండే వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియుల ఇళ్లలో వెరైటీ వంటకాలు సందడి చేస్తుంటాయి. మటన్, చికెన్, ఫిష్ కర్రీస్ ఎప్పుడూ తినేవే కదా.. ఈసారి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలనిపిస్తే పీతల మసాలా కూర బెస్ట్ ఛాయిస్. సముద్రపు రుచులను ఇష్టపడే వారికి పీతల కూర ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. దీని గుజ్జు లేదా మసాలా అన్నంలోకి కలుపుకుని తింటుంటే ఆ మజానే వేరు. పైగా ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యాకి కూడా చాలా మంచివి. మరి ఆ టేస్టీ పీతల మసాలాను మన ఇంట్లోనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ లో ఎలా వండుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

పీతలు – ఒక కేజీ, ఉల్లిపాయలు – మూడు, టమోటాలు – రెండు, పచ్చిమిర్చి – నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు, కారం – మూడు స్పూన్లు, ధనియాల పొడి – రెండు స్పూన్లు, పసుపు – అర స్పూన్, గరం మసాలా – ఒక స్పూన్, జీలకర్ర పొడి – అర స్పూన్, నూనె – నాలుగు స్పూన్లు, ఉప్పు – తగినంత, కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – రెండు రెమ్మలు, నిమ్మరసం – కొద్దిగా.

మసాలా పేస్ట్ కోసం:

Advertisement

పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, జీలకర్ర – ఒక స్పూన్, సోంపు – అర స్పూన్, లవంగాలు – నాలుగు, చెక్క – చిన్న ముక్క, యాలకులు – రెండు, మిరియాలు – అర స్పూన్, నానబెట్టుకున్న జీడిపప్పు – పది.

Also Read: ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఈ ఆదివారం ఘుమఘుమలాడే ఉలవచారు బిర్యానీ ట్రై చేయండి!

తయారీ విధానం:

Advertisement

ముందుగా పీతలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పీతలపై ఉండే పెంకులను, కాళ్లను జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి మసాలా పేస్ట్ కోసం తీసుకున్న కొబ్బరి, జీలకర్ర, సోంపు, లవంగాలు, చెక్క, యాలకులు, మిరియాలు, జీడిపప్పు వేసి దోరగా వేయించుకుని మెత్తటి పేస్ట్‌లా రుబ్బి పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి.

తరువాత సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు మగ్గించాలి. టమోటాలు గుజ్జులా అయిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలా నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.

ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతలను ఈ మసాలాలో వేసి బాగా కలపాలి. పీతలకు మసాలా బాగా పట్టేలా రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మసాలా పేస్ట్ ను ఇందులో కలపాలి.

మసాలా పీతలకు బాగా పట్టిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి, మూత పెట్టి మీడియం మంట మీద 15 – 20 నిమిషాల పాటు ఉడికించాలి. పీతలు ఉడికిన తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి చల్లుకోవాలి. చివరగా కొద్దిగా నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని దింపేసుకోవాలి. అంతే.. వేడి వేడి పీతల మసాలా కూర సిద్ధం. దీన్ని అన్నంతో లేదా చపాతీతో తింటే రుచి అదిరిపోతుంది.

Also Read: ఓవెన్ అవసరం లేదు.. కుక్కర్‌లోనే మెత్తటి చాక్లెట్ కేక్ ఇలా తయారు చేసేయండి!

Tags

Related News

దెయ్యాలు ఉన్నాయని చెప్పడం, గిలిగింతలు పెట్టడం చేస్తున్నారా? పిల్లల పెంపకంలో ఈ తప్పులు చేయకూడదు

నోరూరించే బెండకాయ పచ్చడి..చపాతీ,అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఈ ఆదివారం ఘుమఘుమలాడే ఉలవచారు బిర్యానీ ట్రై చేయండి!

మనుషులను వణికిస్తున్న ‘షమోండా వైరస్’.. తొలి మరణం నమోదు, అసలేంటీ వింత వ్యాధి?

ఓటమి ఎదురుగా ఉన్నప్పుడు ఈ తప్పు చేయకండి.. బలమైన శత్రువును ఎదుర్కోవాల్సిన వ్యూహం

ఏదైనా ఇట్టే పసిగట్టేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు

భర్త ఆఫీస్ నుంచి రాగానే భార్య ఈ 5 పనులు చేయాలి.. దాంపత్య జీవితం సుఖంగా సాగడానికి టిప్స్

Big Stories

Advertisement
×