E-Paper
Advertisement

కుమారి ఆంటీకి వంట నేర్పించింది ఆ సింగర్ తల్లినా.. వంట చేయడం రాదంటూ

కుమారి ఆంటీకి వంట నేర్పించింది ఆ సింగర్ తల్లినా.. వంట చేయడం రాదంటూ
Advertisement

Kumari Aunty: కుమారి ఆంటీ సోషల్ మీడియా స్టార్ గా కొనసాగుతున్నారు. ఎక్కడో హైదరాబాదులో హైటెక్ సిటీ ప్రాంతంలో జీవనాధారం కోసం ఒక ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ గడుపుతున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీ రేంజ్ హోదా అందుకున్నారు. ఇక కుమారి ఆంటీ ప్రతిరోజు మధ్యాహ్నం వివిధ రకాల వెజ్, నాన్ వెజ్ తయారు చేసుకొని హైటెక్ సిటీ ప్రాంతంలో ఫుడ్ అమ్ముతూ జీవనం గడిపారు. అయితే కుమారి ఆంటీ వద్ద తక్కువ ధరలకే టేస్టీ ఫుడ్ దొరకడంతో ఎంతోమంది యూట్యూబర్స్ అక్కడికి వెళ్లి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమెకు మంచి క్రేజ్ లభించింది.

యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదాయం..

ఇలా సోషల్ మీడియాలో కుమారి ఆంటీ (Kumari Aunty) బాగా పాపులర్ అవడంతో ఈమె బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు .అలాగే సినిమా ప్రమోషన్లను కూడా నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు .మరో యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమారి ఆంటీ తనకు సంబంధించిన పలు విషయాలను తెలియజేశారు. కైకలూరు సమీపంలోని తామరకొల్లు గ్రామంలో పుట్టిన కుమారి ఆంటీ కేవలం నాలుగవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు.

హేమచంద్ర తల్లి వద్ద వంటలు నేర్చుకున్న కుమారీ ఆంటీ..

Advertisement

అప్పట్లో తన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఈమె చదువు మధ్యలో మానేసి తన తల్లిదండ్రులకు పొలం పనులలో సాయంగా ఉండేవారు పొలం పనులు పూర్తి అయిన తర్వాత కుమారి ఆంటీ టైలరింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఇలా టైలరింగ్ నేర్చుకున్న ఈమె ఆ తర్వాత సింగర్ హేమచంద్ర(Hema Chandra) ఇంట్లో పని కోసం వెళ్లానని తెలిపారు. అయితే ఆ సమయంలో తనకు పెద్దగా వంటలు చేయడం రాదని కుమారి ఆంటీ తెలిపారు. ఇలా తనకు వంటలు రాకపోవడంతో హేమచంద్ర తల్లి గారు శశికళ(shashikala) తనకు ఎన్నో రకాల వెజ్ ఐటమ్స్ చేయడం నేర్పించారని, పెళ్లి తర్వాత తాను నాన్ వెజ్ వంటివి చేయడం నేర్చుకున్నానని తెలిపారు.

హేమచంద్ర ఇంట్లో పని చేసిన కుమారి ఆంటీ..

Advertisement

ఇక తాను కేవలం హేమచంద్ర ఇంట్లో మాత్రమే పని చేశాను ఆ తర్వాత ఎక్కడ పని చేయలేదని తెలియజేశారు. ఇలా పెళ్లికి ముందు పెద్దగా వంటలు చేయటం రాని కుమారి ఆంటీ ఇప్పుడు ఏకంగా ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఫుడ్ బిజినెస్ ద్వారా భారీగా సంపాదిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలిచారు. ఫుడ్ బిజినెస్ నడుపుతూ సోషల్ మీడియాలో పాపులర్ కావడంతో ఎంతోమంది మహిళలు ఇలా ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈమె ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ రన్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మంచి ఆదాయం అందుకుంటున్నారు.

Also Read: కుమారి ఆంటీ లవ్ స్టోరీ విన్నారా…లవ్ లెటర్ ఫ్రేమ్ చేయించి పెట్టిన ఆంటీ!

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×